ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
కలెక్టర్.హరి నారాయణన్
నెల్లూరు.: ఏప్రిల్ .26 (ప్రజా అమరావతి). రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన విన్నపాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో ఉన్నాయో స్థానిక కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో బుధవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు . ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలపై ప్రజలలో ఎంతో నమ్మకం ఉంటుంది కాబట్టి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు అనుమతులు , నిధుల కోసం స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో రాష్ట్రస్థాయి అధికారులతో సంప్రదించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సంబంధిత శాఖల సెక్రటరీలు ముఖ్యమంత్రి హామీలపై సమీక్ష చేస్తున్నారు కాబట్టి పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ప్రతిపాదనలు పంపినట్లైతే అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలన్నారు. సి.పి.ఒ. సంభందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నివేదికలు తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఏపీఐఐసీ ,ఆర్డబ్ల్యూఎస్ ,ల్యాండ్ ఎక్విజేషన్, ఎండోమెంట్స్ ,ఎడ్యుకేషన్ ,ఫారెస్ట్ తదితర శాఖల హామీలపై సమీక్ష చేశారు ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ ,సిపిఓ ఎ. ఎస్. రాజు ,డీఎఫ్ ఓ చంద్రశేఖర్, శ్రీనివాసులు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ , ఎస్.ఇ.లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment