రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి, మోడరన్ డెంటల్ కేర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెల్లంపూడిలో ఉచిత డెంటల్ క్యాంప్.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి,  మోడరన్ డెంటల్ కేర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెల్లంపూడిలో ఉచిత డెంటల్ క్యాంప్*



*ఉచిత డెంటల్ క్యాంప్ కు విశేషా స్పందన*


రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి, మోడరన్ డెంటల్ కేర్ వారి

సంయుక్త ఆధ్వర్యంలో ఎంటిఎంసి పరిధిలోని రోటరీ దత్తత గ్రామమైన  

మెల్లంపూడి సచివాలయంలో ఆదివారం ఉచిత డెంటల్  క్యాంప్ నిర్వహించారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి వివేకానందరెడ్డి మాట్లాడుతూ

ఉచిత డెంటల్ కేర్ క్యాంప్ 

కు విశేష స్పందన లభించిందని

అన్నారు.52 మందికి డెంటల్ (పంటి) సంబంధిత సమస్యలతో ఉన్నవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.

మోడరన్ డెంటల్ కేర్ వైద్యులు డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ  డెంటల్ సమస్యలను నిర్లక్ష్యం

చేయకూడదని అన్నారు.

ముందుగా తెలుసుకొని వైద్య పరీక్షలు చేయించుకుంటే పంటి సమస్యలను అరికట్టవచ్చు అన్నారు.కొంతమంది పంటి సమస్యలపై జాగ్రత్తలు తీసుకుంటారని మరి కొంతమంది నిర్లక్ష్యం  వహిస్తారని అన్నారు.పంటి సమస్యలను ముందుగానే గుర్తించి వైద్య సేవలు తీసుకుంటే పళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి గ్రామ వికాస్ ప్రాజెక్ట్ చైర్మన్ చంద్రా ఓబులారెడ్డి,ప్రసాద్ రెడ్డి,శంకరశెట్టి రమేష్

ఆర్.సి.సి. సభ్యులు, ,రాజా రామిరెడ్డి,మాజీ ఎంపిటిసి ఈదులముడి శేఖర్, షేక్ సుల్తానా,పున్నా రెడ్డి,

నాని,మోడరన్ డెంటల్ కేర్ వైద్యులు డాక్టర్ హరిప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.

Comments