రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది*
పవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ ను ప్రార్తించ డం జరుగుతుంది*
*ఇఫ్తార్ విందులు సోదరభావం, ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపజేస్తాయి..*
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పుట్టపర్తి, ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి):రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి శిల్పా రామం నందు జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూపవిత్రమైన రంజాన్ మాసంలో విశ్వశాంతికి ఆ అల్లాహ్ ను ప్రార్తించ డం జరుగుతుందని, పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యమని అభినందనీయం అన్నారు. కులమతాలకు అతీతంగా రంజాన్ మాసంలో మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. పవిత్ర దైవారాధనకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలం అన్నారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయన్నారు. ప్రతి పేదవారికి దానధర్మాలు చేయడం ఈ ఈ మాసం ప్రత్యేక విశిష్టతని తెలిపారు. ఏ మతమైనా ఏ కులమైన దానధర్మాలు చేయడం మంచి శుభ పరిణామామని తెలిపారు పొరుగు వారిని ఆదరించాలి. మైనార్టీ వర్గ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు, నా స్థాయిలో ఉన్న వాటిని పరిష్కరించడం జరుగుతుందని. కొన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి అమలు చేయడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు
ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ అందరికీ సృష్టికర్త భగవంతుడు ఒక్కడేనని పేర్కొన్నారు. దైవాజ్ఞానుసారం ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజు ప్రార్ధనలు జకాత్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి ఖురాన్ బోధనలు, మహమ్మద్ ప్రవక్త ఆదేశాలు ఉపకరిస్తాయని, ఉపవాస దీక్షలు మనుషుల్లో ప్రేమ సోదర భావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మైనార్టీలకు పూర్తి సంరక్షణ తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగాదివంగత నేతవై.యస్.రాజశేఖర్ రెడ్డి మైనారిటీ లకు 4శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు.
తద్వారా మైనారిటీ లు విద్యా ఉద్యోగాల లో అవకాశాలను పొందుతున్నట్లు పేర్కొన్నారు.
మైనారిటీలసంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు.
గతం ప్రభుత్వాలు ముస్లింల అభ్యున్నతికే ఎలాంటి కృషి చేయలేదని ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవి రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తిప్పన్న, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నూరుల్లా, డైరెక్టర్లు, మౌలానా కలీం, ఆర్డీవో భాగ్యరేఖ, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ,ముస్లిం మత పెద్దలు, ఉపవాస దీక్షకులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment