వెనిగండ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు.

 *- వెనిగండ్ల గురించి ప్రత్యేకంగా  ప్రస్తావించిన చంద్రబాబు*


 *- అమెరికాలో తెలుగువాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు* 

 *- మూడు ముక్కలాడే వారిని చిత్తుగా ఓడించాలని పిలుపు* 



గుడివాడ, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువాళ్ళు బ్రహ్మాందంగా రాణిస్తున్నారని, ఇక్కడున్న వెనిగండ్ల రాము నిన్నటి వరకు అక్కడే పనిచేసి ఇక్కడకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం రాత్రి కృష్ణాజిల్లా గుడివాడలోని వీకేఆర్, వీఎన్బీ అండ్ ఏజికే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వెనిగండ్ల రాము గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒకప్పుడు ఆమెరికాకు వెళ్ళివస్తే చాలనుకునే పరిస్థితి ఉండేదన్నారు. తెలుగు వాళ్ళు అమెరికాలో బ్రహ్మాందంగా రాణిస్తున్నారన్నారు. వెనిగండ్ల రాము కూడా అమెరికాలో పనిచేసి ఇక్కడకు వచ్చారన్నారు. తెలుగుజాతికి ఐటీ అనే ఆయుధాన్ని ఇచ్చానన్నారు. ఆ ఆయుధాన్ని చేత పట్టుకుని ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడున్న వారి కంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నారన్నారు. దేశంలో ఎన్నో రకాల భాషలు ఉన్నాయన్నారు. అమెరికాలో మాట్లాడే మొదటి 20 భాషల్లో తెలుగుభాష కూడా ఉందని తెలిపారు. ఇంగ్లీష్ తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో ఎక్కువ ఉందన్నారు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రానికి వెళ్ళిందన్నారు. హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అమరావతికి శ్రీకారం చుట్టానన్నారు. అమరావతి పేరు వినగానే ప్రపంచమే మైమర్చిపోయిందన్నారు. దేవతలుండే ప్రాంతం అమరావతి అని అన్నారు. సైకోకి అది మాత్రం గిట్టలేదన్నారు. ఇక్కడుండే బూతుల ఎమ్మెల్యేకు కూడా మూడు రాజధానులు కావాలంట అంటూ ఎద్దేవా చేశారు. మూడు ముక్కలాడే వాళ్ళను చిత్తుగా ఓడించి తరిమికొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల పైనే ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.

Comments