*- ప్రజల కోసం వెనిగండ్ల సేవా కార్యక్రమాలు అభినందనీయం
*
*- ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదల ఆరోగ్యంపై దృష్టి*
*- వెనిగండ్ల ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ*
*- నిరుద్యోగ యువతకూ చేయూతనందిస్తున్న వెనిగండ్ల*
*- సభలో మాట్లాడిన ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు*
గుడివాడ, ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మాకరరావు అన్నారు. ఇటీవల వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్య పరీక్షలు జరిపి సమస్యలు ఉన్నవారిని గుర్తించారు. కళ్ళజోళ్ళు అవసరమైన వారికి వాటిని వెనిగండ్ల రాము సమకూర్చారు. ఈ కళ్ళజోళ్లను మంగళవారం గుడివాడలో జరిగిన కార్యక్రమంలో కాకొల్లు భస్మాకరరావు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాకొల్లు భస్మాకరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే సేవ చేయాలన్న ఆలోచనలు వస్తాయన్నారు. పేద ప్రజలను ఉద్ధరించాలన్న వెనిగండ్ల రాము ఆలోచన చాలా గొప్పదని చెప్పారు. నియోజవర్గంలో పేద ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే దిశగా వెనిగండ్ల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టారని తెలిపారు. నిరుద్యోగ యువతకు కూడా చేయూతనందిస్తున్నారని కొనియాడారు. దీనిలో భాగంగానే మెగా జాబ్ మేళా ద్వారా దాదాపు 1500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించారని గుర్తు చేశారు. వెనిగండ్ల సేవలను గుడివాడ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకొల్లు భస్మాకరరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి చల్లగుళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ గుత్తా చంటి, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, లింగం చిట్టిబాబు, ఊకోటి శివాజీ, రాజశేఖర్, అందుగుల యేసుపాదం, జోన్స్, తుమ్మలపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, శంకరంపాడు సర్పంచ్ కైలే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment