స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.

 *స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి


*


*: గడువులోపు గ్రీవెన్స్ ని పరిష్కరించాలి*


*: బియాండ్ ఎస్ఎల్ఏ వస్తే సంబంధిత అధికారులకు మెమో జారీ చేయాలి*


*: గ్రీవెన్స్ నాణ్యతగా పరిష్కరించారా లేదా అనేది ఆడిట్ టీంలు పరిశీలన చేయాలి*


*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి):


స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, గడువులోపు గ్రీవెన్స్ ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.


శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి స్పందన గ్రీవెన్స్, బియాండ్ ఎస్ఎల్ఏలు, రీఓపెన్ గ్రీవెన్స్ లు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ బియాండ్ ఎస్ఎల్ఏలోకి ఒక్కటి కూడా రాకూడదని, గ్రీవెన్స్ ని సకాలంలో పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ వస్తే సంబంధిత అధికారులకు మెమో జారీ చేయాలని డిఆర్ఓని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో స్పందనకు అత్యంత ప్రధాన్యత ఇస్తున్నారని, ప్రాధాన్యతను అర్థం చేసుకొని గ్రీవెన్స్ గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ ని నాణ్యతగా పరిష్కరించడం అత్యంత కీలకమని, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఉన్న ఆడిట్ టీంలు గ్రీవెన్స్ ని నాణ్యతగా పరిష్కరించారా లేదా అనేది పరిశీలన చేసుకోవాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేశారా లేదా అనేది కూడా చూడాలని, గ్రీవెన్స్ ని నాణ్యతగా పరిష్కరించడం, అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేయడం రెండూ ముఖ్యమన్నారు. రీఓపెన్ కేసులు 31 ఉన్నాయని, వచ్చిన రీఓపెన్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వ్యక్తిగతంగా రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలన చేసి పరిష్కరించాలని, మళ్లీ రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. రీఓపెన్ కేసులు సింగిల్ డిజిట్ లోనే ఉండాలన్నారు.


ప్రతి శుక్రవారం జిల్లా, డివిజన్ అధికారులు వారికి కేటాయించిన స్కూల్, పిహెచ్సి, తదితర ప్రాంతాలను విజిట్ చేసి ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాల్సి ఉంటుందని, అధికారుల క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు వారి శాఖ పరిధిలోని పనులను కూడా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ నెలకొన్న సమస్యలపై ఫీడ్ బ్యాక్ అందించాలన్నారు. జిల్లా అధికారుల గ్రూపులో అధికారులు పంపించిన మెసేజ్లకు కిందిస్థాయి అధికారులు రెస్పాండ్ కావడం చేయాలని, వారి పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి తహసీల్దార్ లు ఎలాంటి పెండింగ్ లేకుండా దరఖాస్తులను సకాలంలో అందించాలన్నారు. కన్సిస్టమ్స్ రిథమ్స్ లో భాగంగా పాఠశాలల తనిఖీలో మరింత పురోగతి తీసుకురావాలని, ఈ విషయమై ఎంపిడిఓలు దృష్టి సారించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పనులకు వెంటనే సాంక్షన్ తీసుకొని పనులను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Comments