క్రీడల పట్ల ఆసక్తికి రాష్ట్రానికి పతకాలు సాధించి యువతకు ఆదర్శం గా నిలిచిన బాల కృష్ణ



రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


క్రీడల పట్ల ఆసక్తికి  రాష్ట్రానికి పతకాలు సాధించి యువతకు ఆదర్శం గా నిలిచిన బాల కృష్ణ 




జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత 


అర్జిబాలకృష్ణ  మున్సిపల్ వర్కర్ గా పని చేస్తూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తు వెయిట్ లిఫ్టింగ్ పతకాలు సాధించడం ద్వారా ఎందరికో ఆదర్శం ఆయ్యారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.



సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసి పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆసక్తి, గెలవాలనే పట్టుదల కు బాల కృష్ణ వంటి వ్యక్తులు ఆదర్శం అని యువత అటువంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు.


స్థానిక బొమ్మురు నేతాజీ  నగర్ లో డివివి సత్యనారాయణ దగ్గర పవర్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకుంటూన్నట్లు తెలిపారు.  రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ లో ప్రధమ స్థానం సాధించినట్లు బాలకృష్ణ  .ఆంధ్ర ప్రదేశ్ తరుపున  కేరళలో జరిగిన  నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో ఎప్రిల్ 4-6 తేదీలలో జరిగిన పోటీల్లో 2 బంగారం పతకాలు 2 రజత  పతకాలు సాధించి 74  కేటగిరీ లో నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని తెలిపారు..



Comments