రేపు (01–06–2023) గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


*రేపు (01–06–2023) గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*మంగళగిరి సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ వివాహానికి హాజరుకానున్న సీఎం.*

*అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది– మొదటి విడతగా వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం.**అమరావతి.*

గురువారం (01–06–2023) ఉదయం 7.30 గంటలకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు.

మంగళగిరిలోని సీ కే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.

అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం,  వరుసగా ఐదో ఏడాది – తొలివిడత వైయస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 

సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Comments