అష్టోత్తర శతకుండాత్మక(108) చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.

 

విజయవాడ (ప్రజా అమరావతి);



*సనాతన ధర్మ పరిరక్షణ కోసం,  రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యాల కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందటం కోసం, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం, లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవదాయ, ధర్మధాయ శాఖ నిర్వహణలో వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, ఆగమ నియమాలకు అనుగుణంగా  అష్టోత్తర శతకుండాత్మక(108)  చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞం*


*విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మే 12 (శుక్రవారం) నుండి 17 (బుధవారం) వరకు 6 రోజుల పాటు కొనసాగనున్న మహా యజ్ఞం*


*తొలిరోజు(12.05.2023) ఉదయం 5 గం.లకు మహామంగళవాయిద్య హృద్య నాదము, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర - విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, అజస్ర దీపారాధన మొదలైనవి జరుగును*


*రాష్ట్ర ప్రజలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం  చేపట్టే మహా క్రతువులో భాగంగా రేపు(12.05.2023) ఉదయం 8.30 గం.లకు యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  సమక్షంలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభోత్సవం*


*రాష్ట్ర సంక్షేమం కోసం 6 రోజుల పాటు యజ్ఞధారణను స్వీకరించనున్న ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ. కొట్టు సత్యనారాయణ, శ్రీమతి సౌధని కుమారి దంపతులు*


*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్మదాయశాఖ ద్వారా 108 కుండములలో చతురాగమ యుక్తంగా గావించే మొట్ట మొదటి మహాయజ్ఞం ఇది*


*వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనే నాలుగు ఆగమాలతో.. యజ్ఞాలు, హోమాలు మరియు వీరశైవం, తంత్రసారం, గ్రామదేవతారాధన, చాత్తాద శ్రీవైష్ణవం అనే నాలుగు ఆగమముల ప్రకారముగా జప పారాయణములు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న మహోన్నతమైన యజ్ఞం ఇది*

 

*రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం కోసం 108 కుండములతో నిర్వహిస్తున్న అద్భుతమైన, అపూర్వమైన అఖండ పుణ్య ప్రదాయకమైన యజ్ఞంలో భాగంగా ప్రతి రోజూ జరిగే కార్యక్రమాలు*:


*ప్రతి రోజూ చతురాగమ యాగశాలల యందు 108 కుండములలో విశిష్టమైన అర్చనలు, హోమమలు, దేవతామూర్తులకు అలంకారాలు జరుగును*

 

*శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రజలకు కలగడానికి సుగంధ ద్రవ్యాలతో, పవిత్ర సప్తనదీ జలాలతో, త్రి సముద్ర జలాలతో, 1008 కలశాలతో విశేష అభిషేకములు జరుగును*


*ప్రతిరోజూ విశిష్ఠ పీఠాధిపతులచే అనుగ్రహ భాషణం నిర్వహించబడుతుంది. ప్రధానంగా శ్రీ సిద్దేశ్వరీ పీఠం, తిరుపతి శ్రీ శక్తి పీఠం, శ్రీశైలం సూర్య సింహాసన పీఠం, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం, పుష్పగిరి మహా సంస్థాన పీఠం,  తిరుమల, తిరుపతి దేవస్థానం, మైసూరు దత్త పీఠం తదితర పీఠాల పీఠాధిపతులచే అనుగ్రహ భాషణం నిర్వహించబడును*


*ప్రతిరోజూ సాయంత్రం గంట పాటు “ ప్రవచన భాస్కర” బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనము, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ*


*రాత్రి 7.30 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు భక్తాభీష్ట ప్రదాయకంగా, భక్తులకు అఖండమైన పుణ్య ఫల ప్రాప్తి కొరకు ఐదు రోజుల పాటు కళ్యాణోత్సవ కార్యక్రమం*


*అందులో భాగంగా తొలి రోజు (12.05.2023) శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం, రెండో రోజు (13.05.2023) ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  వార్ల కళ్యాణ మహోత్సవం, మూడో రోజు (14.05.2023) అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారికి కళ్యాణ మహోత్సవం, నాలుగో రోజు (15.05.2023) శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల లీలా కళ్యాణ మహోత్సవం, ఐదో రోజు (16.05.2023) శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం*


*ఆరో రోజు(17.05.2023) అయిన చివరి రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సన్నిధిలో మరియు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి అన్వయముతో మహా పూర్ణాహుతి కార్యక్రమం ఆగమోక్తముగా జరుగును*


*అనంతరం పుణ్య కలశ జలాలతో సంప్రోక్షణ, వేదాశీర్వచనము, భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో కార్యక్రమం ముగియును*


*భక్తులకు ధర్మప్రచార రథాల యందు వేంచేసి ఉన్న వివిధ దేవతామూర్తుల దివ్య దర్శన భాగ్యమ కల్పించబడును*


*ప్రతిదినం భక్తులు వేలాదిగా తరలివచ్చి యజ్ఞమును వీక్షించి తీర్థమును, యజ్ఞ ప్రసాదాలు స్వీకరించి తరించాలని వినతి*


*ధర్మ ప్రచారం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, భావితరాలకు హిందూ ధర్మ ఔన్నత్యం చాటి చెప్పాలన్న సదుద్దేశంతో చేపట్టే యజ్ఞాల ద్వారా అవగాహన ఏర్పడి భగవంతుని మీద మరింత భక్తి, విశ్వాసం కలుగుతాయని నమ్మకం*


*“సర్వేజనా సుఖినో భవంతు – సమస్త సన్మంగళాని భవంతు”

Comments