పదో తరగతి సప్లమెంటరీ, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలి.

 

నెల్లూరు, మే 29 (ప్రజా అమరావతి);:  పదో తరగతి సప్లమెంటరీ, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాల


ని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

 మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ వీసీ హాల్లో పదో తరగతి, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ జిల్లాలో వచ్చేనెల 2వ తేదీ నుంచి  10వ తేదీ వరకు జరగనున్న టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 43 కేంద్రాల్లో 8400 మంది విద్యార్థులు  హాజరవుతున్నారని, పరీక్షల నిర్వహణకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఉండేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 


3వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

............. 

వచ్చేనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు (4వ తేదీ మినహా) ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 28/2022 కు సంబంధించి మెయిన్స్ పరీక్షలను కనుపర్తిపాడు ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించనున్నట్లు డిఆర్ఓ వెంకటనారాయణమ్మ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే పరీక్షలకు అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు. 


 ఈ సమావేశంలో నుడా విసి బాపిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ సంజనాసింహ, అసిస్టెంట్ కమిషనర్ రామారావు, తాసిల్దార్ రాఘవేంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Comments