జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*

 జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*



పుట్టపర్తి, మే 15 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  అరుణ్ బాబుఅధికారులను ఆదేశించారు.


రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన '' జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023-24'' లను సోమవారం కలెక్టరేట్‌ లోని సభా భవన్ లో జిల్లా కలెక్టర్ 

 పి .అరుణ బాబు ఆవిష్కరించారు.సంక్షేమ క్యాలెండర్‌ ఆవిష్కరణలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, డిఇఓ మీనాక్షి, జిల్లా సమాచార  పౌర సంబంధాల అధికారి  వేలాయుధం  తదితరులు పాల్గొన్నారు.


ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ క్యాలెండర్ లో పొందుపరచడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఏ నెలలో సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అందజేయవలెనో షెడ్యూల్‌ వివరిస్తూ క్యాలెండర్లో ఉన్నాయన్నారు. అధికారులు వారి శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనల మేరకు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన 2023-24 ఆర్థిక సంవత్సర సంక్షేమ క్యాలెండర్ ను మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు,అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ చేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా ముందుగానే ప్రకటించి తదనుగుణంగా ప్రభుత్వం లబ్ది చేకూరుస్తోందన్నారు.


*నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను వివరాలు*.


మే 2023 - వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా


జూన్‌ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి


జులై 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (రెండో త్రైమాసికం)


ఆగష్టు 2023 - జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర


సెప్టెంబర్‌ 2023 - వైఎస్సార్‌ చేయూత


అక్టోబర్‌ 2023 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)


నవంబర్‌ 2023 - వైఎస్సార్‌ సున్నావడ్డీ - పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు- షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)


డిసెంబర్‌ 2023 - జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి


జనవరి 2024 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)


ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు -షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం


మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు



Comments