ఈనెల 22 వ తేదీన మచిలీపట్నంలో ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు !!


 

మచిలీపట్నం : మే 12 (ప్రజా అమరావతి);


*ఈనెల 22 వ తేదీన మచిలీపట్నంలో ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు !!


*


--- పర్యవేక్షించిన స్థానిక ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ 


---- పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని హెలిపాడ్ స్థల పరిశీలన 


--- రూ 348 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన కలెక్టర్ 


 కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లో ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరపనున్న పర్యటన నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లను మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మతో కలిసి శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు.


 మొదటిగా సీఎం బహిరంగ సభ ప్రాంగణం కోసం నిర్దేశించబడిన చిలకలపూడి  ఈతకొలను సమీపంలో గల ఎనిమిదిన్నర ఎకరాల భారత్ స్కౌట్స్, గైడ్స్ ప్రాంతీయ శిక్షణ శిబిర మైదానాన్ని పరిశీలించారు.


అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు  పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని హెలిపాడ్ ప్రాంతాన్నీ పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమి పూజ నిర్వహించి ఓడరేవు నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో సభ ప్రాంగణం,ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పరిశీలించి ఏర్పాట్ల గురించి సమీక్ష అధికారులతో చేశారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దిగే ప్రాంతాన్ని పరిశీలించి.. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా వేగవంతం చేయాలని పోలీస్ అధికారులను కోరారు. 


తర్వాత స్థానిక గిలకలదిండిలో రూ.348 కోట్లతో ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్వయంగా  పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ మ్యారీ టైం పేజ్ -1 ఫిషింగ్ హార్బర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మునిరెడ్డి , సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్ డి ఎస్ ప్రసాద్ లు ఫిషింగ్ హార్బర్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులను మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. సీమౌత్  ( సముద్రపు మొగ ) నుండి 3 కిలోమీటర్ల ప్రధాన కాలువ మార్గంలో 22 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను డ్రెడ్జర్ల సహాయంతో ఇప్పటికే 70 శాతం తవ్వకం పనులు పూర్తయినట్లు హార్బర్ అధికారులు వివరించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పరిధిలో 28 ఎకరాలలో 23 భవనాలు నిర్మితమవుతున్నట్లు చెప్పారు. అందులో ఆక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, గేర్ కటింగ్, రెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, రోజుకి 3 వేల ఐస్ బ్లాకులను తయారు చేసే ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, క్యాంటీన్, తదితర భవనాలు ఈ ప్రాంగణంలో నిర్మితమవుతాయని చెప్పారు. డ్రెడ్జింగ్ పనులు 3.5 మీటర్ల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వడం జరుగు తుందన్నారు తద్వారా రాబోయే 50 ఏళ్ల వరకు స్థానిక మత్స్యకారుల పడవలకు సముద్రపు మొగలో ఎటువంటి ఇసుక మేట అడ్డంకి లేకుండా చేపలవేటకు సురక్షితంగా వెళ్లేందుకు వీలు పడుతుందన్నారు. సముద్ర మొగకు దక్షిణం వైపు గల కృష్ణా నది సిల్ట్ కారణంగా మొగ పూడికకు కారణం అవుతున్నదని, దీని నివారణకు దక్షిణం వైపు 1240 మీటర్లు, ఉత్తరం వైపు 1150 మీటర్ల పొడవైన గోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు.  మత్స్యకారులు ఫిషింగ్ చేశాక దిగుమతి కోసం ఒకేసారి 600 బోట్లు నిలబెట్టుటకు 790 మీటర్ల ‘కే’ వాల్ కూడా నిర్మించడం ఈ ఫిషింగ్ హార్బర్ లో జరుగుతుందని, మత్స్య సంపద ఎగుమతి దిగుమతుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఈ పనులన్నీ ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 

ఈ సందర్భంగా ఏపీ మ్యారీ టైం పేజ్ -1 ఫిషింగ్ హార్బర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మునిరెడ్డి , సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్ డి ఎస్ ప్రసాద్ లు ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న పనులను మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. స్థానికి గిలకలదిండిలో సముద్రపు మొగ నుండి 3 కిలోమీటర్ల ప్రధాన కాలువ మార్గంలో 22 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను డ్రెడ్జర్ల సహాయంతో ఇప్పటికే 70 శాతం తవ్వకం పనులు పూర్తయినట్లు వివరించారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పరిధిలో 28 ఎకరాలలో 23 భవనాలు నిర్మితమవుతున్నట్లు చెప్పారు. అందులో ఆక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, గేర్ కటింగ్, రెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, రోజుకి 3 వేల ఐస్ బ్లాకులను తయారు చేసే ఐస్ మ్యాన్ ఫ్యాక్చరింగ్  యూనిట్, క్యాంటీన్, తదితర భవనాలు ఈ ప్రాంగణంలో నిర్మితమవుతాయని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు 3.5 మీటర్ల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వడం జరుగు తుందన్నారు తద్వారా రాబోయే 50 ఏళ్ల దాకా మత్స్యకారులకు సముద్రపు మొగలో ఎటువంటి ఇసుక మేట అడ్డంకి లేకుండా చేపలవేటకు సురక్షితంగా వెళ్లేందుకు వీలు పడుతుందన్నారు. సముద్ర మొగకు దక్షిణం వైపు గల కృష్ణా నది సిల్ట్ కారణంగా మొగ పూడికకు కారణం అవుతున్నదని, దీని నివారణకు దక్షిణం వైపు 1240 మీటర్లు, ఉత్తరం వైపు 1150 మీటర్ల పొడవైన గోడ నిర్మించడం జరుగుతుందని అన్నారు.  మత్స్యకారులు ఫిషింగ్ చేశాక దిగుమతి కోసం ఒకేసారి 600 బోట్లు నిలబెట్టుటకు 790 మీటర్ల ‘కే’ వాల్ కూడా నిర్మించడం ఈ ఫిషింగ్ హార్బర్ లో జరుగుతుందని, మత్స్య సంపద ఎగుమతి దిగుమతుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కు వివరించారు.


Comments