రేపు (22.05.2023) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన.


అమరావతి (ప్రజా అమరావతి);


రేపు (22.05.2023) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన.


బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.


ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం మచిలీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Comments