ఎపి సెక్రటేరియట్లో 222 మంది పోలీసు సిబ్బందికి కంటి,పంటి (Eye & Dental) పరీక్షలు.

 ఎపి సెక్రటేరియట్లో 222 మంది  పోలీసు సిబ్బందికి కంటి,పంటి (Eye & Dental) పరీక్షలుఅమరావతి,12 మే (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో

 పనిచేస్తున్న ఎస్.పి.ఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది మరియు అధికారులకు శుక్రవారం అనగా తేది 12.05.2023 నాడు సెక్రటేరియట్ లో ఎస్.పి.ఎఫ్ ఆఫీస్ ఆవరణలో MAX VISION EYE హాస్పిటల్ మరియు ప్రసాద్ డెంటల్ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిoచడం జరిగింది .ఎస్. పి. ఎఫ్. డి.జి. హరీష్ కుమార్ గుప్తా వారి ఆదేశాలు మేరకు ఎస్.పి.ఎఫ్. డి.ఐ.జి. బి.వి.రామి రెడ్డి వారి సలహాల మేరకు కమాండెంట్ డా.కె.ఎన్.రావు వారి  ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరము నిర్వహించారు.ఈ వైద్య శిబిరములో 222 ఎస్.పి.ఎఫ్. అధికారులు మరియు  సిబ్బంది కి కంటి,పంటి వైద్య పరీక్షలు నిర్వహిoచడం జరిగింది.


అంతకు ముందు  సిబ్బందిని ఉద్దేశించి ఆర్యోగ్యము పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సలహాలను హాస్పిటల్ సిబ్బంది సూచిoచడము జరిగిoది. ఈ కార్యక్రమములో సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి కె. కృష్ణ మూర్తి,ఇన్స్పెక్టర్స్  వి.ఎస్.నారాయణ మరియు సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు.Comments