మార్చి 31 వరకూ మెడికల్ రీఇంబర్సుమెంట్ గడువు పొడిగింపు.

 మార్చి 31 వరకూ మెడికల్ రీఇంబర్సుమెంట్ గడువు పొడిగింపు

అమరావతి,10 మే (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు,ఫెన్సనర్ల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెడికల్ రీఇంబర్సుమెంట్ సదుపాయాన్ని ఈఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి వచ్చే 2024 మార్చి 31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు బుధవారం జిఓఆర్టి సంఖ్య 341 ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులు,ఫెన్సనర్ల ఆరోగ్య భద్రతకు అమలు చేస్తున్న మెడికల్ రీఇంబర్సుమెంట్ సౌకర్యాన్ని గతంలో అనగా 2022 ఆగస్టు 1 నుండి 2023 మార్చి 31 వరకూ ప్రభుత్వం పొడిగించడం జరిగింది.ప్రభుత్వ ఉద్యోగుల,ఫెన్సనర్ల ప్రయోజనాలు,ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మెడికల్ రీఇంబర్సుమెంట్ గడవును ఈఏడాది ఏప్రిల్ 1 నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ మరలా పొడిగించడం జరిగింది.ఉద్యోగులు,ఫెన్సనర్లకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పధకం (ఇహెచ్ఎస్)అమలులో ఎదురయ్యే అవాంతరాలను అధికమించేందుకు ఈమెడికల్ రీఇంబర్సుమెంట్ గడువు పెంపు దోహదపడనుంది.

ఇందుకు సంబంధించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా డా.వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్తు కేర్ ట్రస్ట్ సిఇఓను ప్రభుత్వం ఈఉత్తర్వుల్లో ఆదేశించింది.


Comments