జిల్లాలో మీడియా ప్రతినిధులకు 513 అక్రిడేషన్ కార్డుల మంజూరు:జిల్లా కలెక్టర్.
*జిల్లాలో మీడియా ప్రతినిధులకు 513 అక్రిడేషన్ కార్డుల మంజూరు:జిల్లా కలెక్టర్*


తిరుపతి,  మే 27 (ప్రజా అమరావతి): జిల్లాలో అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు 2023, 2024 రెండు సంవత్సరాల కాల పరిమితితో 513 మందికి అక్రిడేషన్లను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. 


శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.


రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాలపరిమితితో జిల్లాలోని జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్ల మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వులు : 38 జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐ అండ్‌ పి ఆర్‌ ) డిపార్ట్‌మెంట్‌ తేది. 30.03.2023 జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను అనుసరించి జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ద్వారా నిబంధనలు మేరకు అర్హతలు కలిగిన పాత్రికేయులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం సమర్పించిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు, పీరియాడికల్, ఫ్రీలాన్సర్స్, వెటరన్  పాత్రికేయులలో అన్ని నిబంధనలు పూర్తిచేసిన వారికి మొదటి విడతలో 513 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం అక్రిడేషన్ మంజూరు కాని వారికి జీవోలోని నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించిన పిదప తదుపరి  కమిటీ సమావేశంలో పరిశీలించి అక్రిడిటేషన్లు మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 


ఉమ్మడి జిల్లాలో జర్నలిస్ట్ బస్ పాస్ ఎలిజిబుల్ అయ్యేలా  ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు డిఐపిఆర్ఓ  బాలకొండయ్య,  కమిటీ సభ్యులు డిప్యూటీ చీఫ్ స్టాఫ్ రిపోర్టర్ సాక్షి  రవి రెడ్డి,    సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ , ది హాన్స్ ఇండియా డా.ప్రదీప్ కుమార్, ఎడిటర్ యువ దర్శిని పత్రిక ముని కృష్ణయ్య, స్టాఫ్ రిపోర్టర్ ఎన్టీవీ కార్తీక్ , స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి లావణ్య కుమార్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ కృష్ణారెడ్డి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శివకుమార్, రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీకాంత్, ఆర్టీసీ ఏఎంటి పద్మావతి, హౌసింగ్ అసిస్టెంట్ మేనేజర్ అవనిజ, డి పి ఆర్ ఓ విజయసింహారెడ్డి, ఏపీఆర్ఓ ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


Comments