మచిలీపట్నం : మే 11 (ప్రజా అమరావతి);
*అవినిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
*
ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎన్నో విద్యా కుసుమాలు ఈ ఏడాది పరిమళించాయిని, పదోతరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థిని విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి అనేకమంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రశంసించారు.
గురువారం సాయంత్రం కృష్ణాజిల్లా కలెక్టర్ ఛాంబర్ వద్దకు జిల్లా విద్యాశాఖధికారిణి తాహెరా సుల్తానా పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్లారు.
అవనిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆకుల ప్రేమ్ సాయి( 592/600) బాగిశెట్టి కావ్యశ్రీ ( 586/600) లను . ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు జిల్లా కలెక్టర్ అభినందించారు. చదివే సత్తా, శ్రద్ధాశక్తులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్యా విధానం,సుశిక్షితులైన ఉపాధ్యాయులతో చక్కని బోధన అక్కడ ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆకుల లంకా శ్రీనివాసరావు, బావిశెట్టి లక్ష్మణరావులు పాల్గొన్నారు
addComments
Post a Comment