పాఠశాలు పునః ప్రారంభం నాటికి జగనన్న విద్యా కానుక కిట్లు సిద్దం.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


* పాఠశాలు పునః ప్రారంభం నాటికి జగనన్న విద్యా కానుక కిట్లు సిద్దం



* జగనన్న విద్యా కానుక కిట్లను పరిశీలన 


* స్కూల్స్ తెరిచే నాటికి విద్యార్థులకు అందచేయాలి 


* ఎస్.కె.వి.టి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో స్టోరేజ్ పాయింట్ సందర్శన.


..జిల్లా కలెక్టర్.. డా. కే. మాధవీలత.



పాఠశాలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందచేసే ప్రక్రియలో ఆయా స్టోరేజ్ పాయింట్స్ వద్ద  సమీకరణ చేయడం జరుగుతోందని  జిల్లా కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు.

స్థానిక ఎస్.కె.వి.టి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  రాజమహేంద్రవరం అర్బన్ మండలంకు సంబందించి విద్యాకానుక కిట్స్ స్టోరేజ్ పాయింట్ ను  విద్యాశాఖ అధికారులతో కలసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యాకానుగా 1,21,735 మంది విద్యార్థులకు కిట్స్ ను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి లక్షా 24 వేల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 70,654 పుస్తకాలు వచ్చాయన్నారు.  ఆయా స్టోరేజ్ పాయింట్స్ కు చేరుకున్న మెటీరియల్  ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి విద్యా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.  పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ అందించే విధంగా ముందస్తు కార్యాచరణతో సిద్దంగా ఉండాలన్నారు. స్టోరేజ్ పాయింట్స్ వద్ద  స్టాక్ బుక్  పకడ్బందీ గా నిర్వహించాలన్నారు. ప్రతీ విద్యార్థికి సరిపడే సైజు షూలు సిద్దం చేసుకొని పంపిణీ కొరకు సిద్దంగా ఉండాలన్నారు. జగనన్న విద్యా కానుక అందచేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తోందని, విద్యాశాఖ అధికారులు అత్యంత శ్రద్దతో భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. పాఠ్యపుస్తకాల భద్రత విషయం లో జాగ్రత్త లు తీసుకోవాలని, ముఖ్యం గా చెదలు దరిచేరకుండా చెదల మందు చల్లించాలన్నారు. వర్షాలు పడుతున్నాయి కనుక కిటికీల దగ్గర లో, గోడలకు అనుకుని స్టాక్స్ లేకుండా గది మధ్యలో సర్దించాలన్నారు. విద్యా కానుక కిట్ లను ప్రణాళికాబద్దం గా పంపిణీ చేసే బాధ్యత ఆయా మండల విద్యా అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి ఎస్.అబ్రహం వివరాలు తెలుపుతూ,  జిల్లా కు 1,21,735 యూనిట్స్ జగనన్న విద్యా కానుక కిట్స్  పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వాటిలో బాలురు 59371మంది, బాలికలు 62364 మంది ఉన్నారని తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం రూరల్ మండలానికి సంబందించి  ఎస్.కె.వి.టి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టోరేజ్ ఫాయింట్ కు చేరుకున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా పరిశీలించామన్నారు.  రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి 16,112 జగనన్న విద్యా కిట్స్ కొరకు ఇండెంట్ పెట్టామన్నారు.  బూట్లు, సాక్స్, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు,  ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లతో కూడిన కిట్స్ వచ్చాయని కలెక్టర్ కు వివరించారు.  వాటిని స్కూల్స్ వారీగా పంపిణీ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ ఉప విద్యా అధికారి బి.దిలీప్ కుమార్, సమగ్ర శిక్షా సి ఎమ్ ఓ శ్రీనివాస్, ఎస్ కె వి టి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎమ్.వి.ఎం. సుబ్రహ్మణ్యం, సి ఆర్ పి లు ,పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్ లు తదితరులు ఉన్నారు.


Comments