మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోంది: *మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోంది:*  *డిప్యూటీ సీఎం* 


 *మహిళా సాధికారత కు ప్రభుత్వం చర్యలు:* 


 *జిల్లా కలెక్టర్* 


పెనుమూరు, మే 10 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు.


బుధవారం జీడి నెల్లూరు నియోజక వర్గ పరిధిలోని పెనుమూరుమండలంలో స్వయం సహా యకసంఘమహిళల చే నూతనం గా ఏర్పాటైన చేయూత మహిళా మార్ట్ ను రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ కలిసి ప్రారంభించారు..


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోమహిళలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యున్నతి కి కృషి చేస్తున్నారని ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాల లబ్ధి మహిళలకుఅందేలా  చేయడం జరుగు తున్నదనన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి అవసరమైన రుణా లను మంజూరు చేయడం జరుగు తున్నదనన్నారు. చేయూత మహిళా మార్ట్ ద్వారా రిటైర్డ్ రంగంలో మహిళలు రాణించేందుకు అవకాశం కలదని తెలిపారు.


జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కు అధిక ప్రాధాన్యత ఇస్తోం దని తెలుపుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికిప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.స్వయం సహాయక సంఘ మహిళల చే నడప బడుచున్నచేయూత మహిళా మార్ట్  మరింత అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలని కోరు కుంటున్నానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వంరిలయన్స్, ఐటిసి,అమూల్ ఇలా పెద్ద పెద్ద కార్పొరేషన్ కంపెనీ లతో ఒప్పందం కుదుర్చుకొనిమహిళా సంఘాలచే నడపబడే మహిళా మార్ట్ లకు చేయూత నుఅందించేందుకు కృషి చేస్తుందన్నారు.


డి ఆర్ డి ఎ పి డి తులసి మాట్లాడు తూ స్వయం సహా యకసంఘమహిళల భాగస్వామ్యంతో ప్రతి సంఘ మహిళా రూ.300 చొప్పున  చేయూత మహిళా మార్ట్ ఏర్పాటుకు పెట్టుబడిగా పెట్టడం జరిగిందని,నాణ్యమైన నిత్యవసరసరుకు లనుఅందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.


చేయూత మహిళా మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంఅనంతరం జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభించారు.


ఈ సమావేశంలో ఎంపీడీఓ శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి డి ఆర్ డి ఏ ఏపీఎంలు,మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు..Comments