*త్వరగా భూసేకరణ పూర్తి చేయాలి
*
*: జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 03 (ప్రజా అమరావతి):
జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, 342, 716-జి, కదిరి బైపాస్, కౌలేపల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి, తదితర రహదారులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. సకాలంలో భూసేకరణ పూర్తి చేయడం ద్వారా రహదారుల నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పుట్టపర్తి, కదిరి ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, నేషనల్ హైవే ఈఈ మధుసూదన్, నేషనల్ హైవే డిఈ గిడ్డయ్య, ఆయా మండలాల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment