అనుమతి లేని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ *

విజయవాడ (ప్రజా అమరావతి);

*అనుమతి లేని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి*

ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖా కమీషనర్ ఆదేశాలు

అనుమతి కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు స్టేట్ సిలబస్ కోసం ఓపెనింగ్/ రికగ్నైజేషన్ అనుమతి పొంది,  సీబీఎస్ఈ /ఐసీఎస్ఈ అడ్మిషన్లు తీసుకుని, ఆ సిలబస్ బోధిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పాఠశాల విద్యాశాఖ  కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.   సీబీఎస్ఈ /ఐసీఎస్ఈ బోర్డుల నుండి ఎలాంటి అనుమతి లేకుండా బోధించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే అని పేర్కొన్నారు. అలాంటి యాజమాన్యాలపై తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, జిల్లావిద్యాశాఖాధికారులను ఆదేశించారు.  అలానే 8,9,10 తరగతులకు అనుమతి లేకుండా స్టేట్ సిలబస్ బోధించినా చర్యలు తీసుకోవాలని కోరారు.


*అనుమతి, గుర్తింపు కోసం సింగిల్ విండో సిస్టమ్*

 

ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ పాఠశాల ప్రారంభ అనుమతి, గుర్తింపు కోసం https:// cse.ap.gov.in/PSIS వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి ఆన్ లైన్ చెల్లింపు ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి రశీదు పొందాలని తెలిపారు.  సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతి పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్ పద్ధతి ద్వారా అయితే పైళ్లు జాప్యం లేకుండా వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

*ప్రయోజనాలు:*

ఆన్లైన్ పద్ధతి వల్ల అగ్నిమాపక శాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్, వైద్యశాఖ, రోడ్లు & భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్, రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖ తదితర ప్రభుత్వ శాఖల నుండి నిరభ్యంతరకర ధ్రువపత్రాలు పొందేందుకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుంది.

ప్రతిపాదనలు ఆన్లైన్ లోనే నేరుగా సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి, నిరభ్యంతరకర ధ్రువపత్రాన్ని, ఖచ్చితత్వము నిర్ణయించే అనుమతిని  నిర్ణీత సమయంలో అందించడమే కాకుండా పారదర్శకతగా ఫైళ్ల ప్రాసెస్ జరుగుతుంది.

ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి అనుమతిని ఇవ్వడానికి పాఠశాల విద్యా శాఖ/ ఇతర విభాగాల సంబంధిత అధికారుల ప్రతి స్థాయిలో కాలపరిమితి నిర్ణయించబడుతుంది.

'ఆన్లైన్ మోడ్ లో ఉన్న  ఫైల్ పెండింగ్ స్థితి, అనుమతి ఆర్డర్లు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది.

'ప్రైవేటు పాఠశాలల అనుమతి మరియు రెన్యూవల్ కు సంబంధించిన దరఖాస్తు రుసుము చెల్లింపును కూడా ఆన్లైన్ చెల్లింపు గేట్ వే ద్వారా చెల్లించి రసీదును పొందవచ్చు.

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎక్కడినుండైనా ఆన్లైన్ లో లాగిన్ అయ్యి, తమ పాఠశాల వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిపాదనలు పాఠశాల అనుమతి కి సంబంధించిన ఆర్డర్లను నేరుగా ఆన్ లైన్ నుండే పొందవచ్చు.
Comments