పకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించిన రైతుల దేశానికిగొప్ప శాస్త్రవేత్తలు
కేంద్ర వ్యవసాయ మరియు పకృతి వ్యవసాయం శాఖ కార్యదర్శిమనోజ్ అహుజా
మెల్లవాయి గ్రామం నందు పకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించిన మహిళ రైతులు దేశానికి తలమానికం
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పత్రికా ప్రకటన
మడకశిర, మే 5 (ప్రజా అమరావతి): పకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలుసాధించినరైతుల దేశానికిగొప్ప శాస్త్రవేత్తలు ఎదిగారని కేంద్ర వ్యవసాయ మరియు పకృతి వ్యవసాయం శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా పేర్కొన్నారు శుక్రవారం మెల్లవాయి గ్రామపంచాయతీ నందు రాష్ట్ర పకృతి వ్యవసాయం శాఖ ఆధ్వర్యంలో మంచి ఫలితాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తలు. క్షేత్ర స్థాయిలో వారి పంట పొలాలను, పొదుపు మహిళా సంఘాలతో ప్రత్యక్షంగా వారి అనుభవాలను ఆరా తీశారు ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రెటరీ యోగిత రానా, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, విజయ్ కుమార్, వ్యవసాయ సలహా మండల్ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. అరుణ బాబు, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ తదితరులు పాల్గొన్నారు. మెలవాయి ఎంపీడీవో కార్యాలయము నందు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీ మాట్లాడుతూ పకృతి వ్యవసాయ మూల సూత్రాలను అర్థం చేసుకోగలిగితే వ్యవసాయంలో పూర్వనుభవం వారు ముఖ్యంగా మహిళలు కూడా సులభంగానే ప్రకృతి వ్యవసాయం చేపట్టవచ్చు అని ఈరోజు మహిళలు అనుభవం పూర్వకంగా చెబుతున్నారు. మెట్ట భూములలో పెద్దగా కష్టపడకుండానే సాగు చేయడానికి వీలైన పంటకు అంతర్ పంటల ద్వారా రైతులు మంచి సూచనలు తెలియజేశారని తెలిపారు. అరుదైన పంటలు సాగు చేయడంతో పాటు సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా వెనుకబడిన మారుమూల ప్రాంతమని ఈ మెలవాయి గ్రామం నందు పకృతి వ్యవసాయంలో మహిళలు మంచి ఫలితాలు సాధించి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారని తెలిపారు. మీ అనుభవాలను దృష్టిలో తీసుకొని ప్రాజెక్టు రిపోర్టును తయారు చేపించి జిల్లాలో అన్ని మండలాలలో పకృతి వ్యవసాయంపై రైతులకు ప్రోత్సహి ఇవ్వడం జరుగుతుందని. వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సకాలను రైతులు సద్వినియోగం చేసి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. మీ పరిస్థితులు అధ్యయనం చేయడానికి కేంద్ర కార్యదర్శి క్షేత్రస్థాయిలో ఈరోజు పర్యటించారని తెలిపారు. దేశమంతా మీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేయడానికి కార్యదర్శి చర్యలు చేపడతాడని తెలిపారు. పకృతివ్యవసాయం ద్వారా రైతులు పొందిన అనుభవాన్ని ఇతర రైతులకు అందించి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలోవారి పర్యటనలో భాగంగా ఈచ్లడ్డి గ్రామం చత్రం పంచాయతీలో శ్రీ బీరప్ప రైతు పొలంను సందర్శించడం జరిగింది అదేవిధంగా బూదిపల్లి గ్రామం గుడిబండ మండలం శ్రీమతి మంజుల మామిడి తోటను సందర్శించడం జరిగింది అలాగే రాళ్లపల్లి గ్రామం లోని శ్రీ నాగేంద్రప్ప వక్క తోటను సందర్శించడం జరిగింది. అదేవిధంగా మెలవాయి గ్రామంలో శ్రీమతి రాధమ్మ గారి పిఎండిఎస్ మోడల్ ను ఏటీఎం మోడల్ ను సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేయడం వలన అధిక లాభాల గురించి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలోని వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
తర్వాత కదిరేపల్లి రైతు భరోసా కేంద్రంలో సందర్శించడం జరిగింది. మెలవాయి గ్రామం నందు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఏపీ సీ ఎన్ ఎఫ్ ZBNF సిబ్బందికి సభ నిర్వహించి చర్చించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు వారి వారి అనుభవాలను భారత ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారులకు తెలియజేయడం జరిగింది.
చివరగా మడకశిరలో ఎరువు డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను సందర్శించడం జరిగింది ల్యాబ్ నందు జరిగే పరీక్ష విధానాలను గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తపరచడమైనది.
ఈ కార్యక్రమంలోడిపిఎం శ్రీ లక్ష్మానాయక్,
జిల్లా ఉద్యాన అధికారి శ్రీ చంద్రశేఖర్ ,
జిల్లా సెరికల్చర్ అధికారి శ్రీమతి పద్మ
మడకశిర వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ కృష్ణ మీనన్, మడకశిర ఏవో శ్రీ వీర నరేష్ , గుడిబండ ఏవో శ్రీ తిమ్మప్ప .
ఉద్యాన శాఖ అధికారి శ్రీ చిన్న రెడ్డయ్య గారు
సెరికల్చర్ ఏడి శ్రీ రాజు నాయక్ గారు
సెరికల్చర్ అధికారి శ్రీ ప్రతాప్ నాయక్ గారు
మడకశిర ఎంపీడీవో శ్రీమతి సోనీ బాయ్ గారు
మడకశిర ఎమ్మార్వో శ్రీ బాలాంజనేయులు గారు
గుడిబండ ఎమ్మార్వో శ్రీ నాగభూషణం గారు
జడ్పీఎన్ఎఫ్ సిబ్బంది సచివాలయం సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగింది.
addComments
Post a Comment