సిద్దిపేట డెంటిస్ట్ డాక్టర్ అరవింద్ కు అరుదైన గౌరవం.

 *సిద్దిపేట డెంటిస్ట్ డాక్టర్ అరవింద్ కు అరుదైన గౌరవం**సౌత్‌ఆఫ్రికాలోని మెడికల్‌ హెల్త్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ రువాండా నుంచి పిలుపు*


*డెంటిస్ట్‌ ఫైనల్‌ పరీక్షల నిర్వహణకు ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా ఆహ్వానం*
 సిద్దిపేట జిల్లా: మే 10 (ప్రజా అమరావతి);

సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రముఖ తెలంగాణా డెంటల్ ఆసుపత్రి డాక్టర్‌ అరవింద్‌కు అరుదైన గౌరవం లభించింది. సౌత్‌ఆఫ్రికాలోని స్కూల్‌ ఆఫ్‌ డెంటిసీ్ట్ర కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ రువాండా ప్రిన్సిపాల్‌ ప్రోఫెసర్‌ అబ్రహంహెచ్‌ఎ మిటికె ఏండి, ఈమేరకు బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీకి సంబందించిన ఫైనల్‌ పరీక్షలో ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ నిర్వహణకు డాక్టర్‌ ఆరవింద్‌కు ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వనంలో ఈ నెల 15 నుంచి 20 వరకు ఫైనల్‌ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. అందుకుగానూ డాక్టర్‌ ఎ. అరవింద్‌కుమార్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా పాల్గొనడంతో పాటు పరీక్షలకు సంబందించి క్లీనికల్‌, ల్యాబ్స్‌ నిర్వహణ, మూల్యాంకనం కూడా నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు హెల్త్‌ ఆండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ రువాండా డాక్టర్‌ అరవింద్‌కు వసతి, భోజనం సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నది. కాగా భారతదేశం తరపున నుంచి డాక్టర్‌ అరవింద్‌కుమార్‌ పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి హెల్త్‌ ఆండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ రువాండాకు వెళ్లడం పట్ల సిద్దిపేట వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పలు పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాల్లో డాక్టర్‌ అరవింద్‌ సేవలు అందించినట్లు వారు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ సౌత్‌ఆఫ్రికాలోని మెడికల్‌ హెల్త్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ రువాండా డెంటిస్ట్‌ ఫైనల్‌ పరీక్షల్లో ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ ఆహ్వనం పంపడం ఆనందంగా ఉందన్నారు. 


 *సిద్దిపేట బిడ్డగా అభినందిస్తున్నా*


*మంత్రి హరీశ్‌రావు*

 

సిద్దిపేట ప్రాంతానికి చెందిన డాక్టర్‌ అరవింద్‌ సౌత్‌ఆఫ్రికాలోని మెడికల్‌ హెల్త్‌ సైన్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ రువాండా డెంటిస్ట్‌ పరీక్షల నిర్వహణకు వెళ్లడం పట్ల ఆనందంగా వ్యక్తం చేయడంతో పాటు సిద్దిపేట బిడ్డగా ఆయనను అభినందిస్తున్నా. పరీక్షల నిర్వహణతో పాటు మూల్యంకనం కూడా చేయడం చాలా అరుదుగా అవకాశం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కీర్తి గడించేలా ఆయన మరిన్ని సేవలు  కొనసాగించాలని కోరుతున్నారు..

Comments