మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయంపై కృతజ్ఞతలు తెలిపిన ఎన్ఆర్ఐలు



**మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయంపై కృతజ్ఞతలు తెలిపిన ఎన్ఆర్ఐలు


*


* దుబాయిలో నిర్వహించిన థాంక్యూ సీఎం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా*


కడప, మే 19 (ప్రజా అమరావతి): పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు అదనపు భారం పడకుండా ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్ది నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. 


 మైనారిటీల హజ్ యాత్రకు అదనపు సాయం అందిస్తూ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్  రెడ్ది  తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ... గురువారం దుబాయ్ లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.


హజ్ యాత్రకు వెళ్లే వారికి విజయవాడ ఎంబార్గేషన్ ద్వారా ఒక్కొక్కరికి 80 వేల రూపాయలు అదనపు ధరను సెంట్రల్ హజ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి , విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇతర అధికారులను తనతో పాటు ఎంపీ మిధున్ రెడ్డిలు కలిశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా  అన్నారు. . అయినా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడంతో... వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిమ్ సోదరులపై అదనపు భారం పడకుండా 80 వేల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 14.15 కోట్ల రూపాయలు ను విడుదల చేసి ముస్లిం సోదరుల పక్షపాతిగా మరోసారి సీఎం రుజువు చేశారన్నారు. 


ఈ సమావేశంలో డాక్టర్ భూ అబ్దుల్లా, కడప యువజన విభాగ అధ్యక్షులు షేక్ ఉమైర్ తదితరులు పాల్గొన్నారు.



Comments