గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

 *గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి


*


*: గడువులోపు జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను పరిష్కరించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 29 (ప్రజా అమరావతి): 


జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీవెన్స్ ను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 204 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ ను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా చూడాలని, నాణ్యతగా పరిష్కారం చూపించాలన్నారు. గ్రీవెన్స్ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రీవెన్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, గ్రీవెన్స్ పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. నిత్యం గ్రీవెన్స్ పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్ ఉన్న వాటిని మానిటర్ చేస్తూ సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం జరిగిన ప్రజా స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలతో కూడిన అర్జీలను సమర్పించారు. ఇందులో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.


1. ధర్మవరం పట్టణంలోని 25వ వార్డు నెంబర్ కు చెందిన పి.శంకరయ్య మాట్లాడుతూ మండలంలోని కునుతూరు గ్రామ సర్వేనెంబర్ 597/1లో 0.33 సెంట్ల భూమి మా పెదనాన్న నుంచి మాకు సంక్రమించిందని, 1980లో శాశ్వత విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశామని, అనుభవంలో ఉన్న భూమిని ఆన్లైన్ అడంగల్ నందు పేరు నమోదు చేయాలని కోరారు.


2. ఓడిసి మండలం బలిజపల్లి గ్రామ జయలక్ష్మికి చెందిన సర్వే నంబర్ 88 లో 3 సెంట్ల భూమిని 2009 సంవత్సరంలో పట్టా పొందడం జరిగిందని, రెవెన్యూ రికార్డులలో తన పేరు లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయవలసిందిగా తెలుపుతూ బాధితురాలు ఫిర్యాదు చేసింది.


ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిఈఓ మీనాక్షి, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ శివరంగ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*



Comments