రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందించి, లాభసాటి వ్యవసాయం ద్వారా ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నది



తణుకు. మే 08 (ప్రజా అమరావతి);


 *రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందించి, లాభసాటి వ్యవసాయం ద్వారా  ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే


రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అశయం అని  రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు*...


సోమవారం తణుకు పురపాలక సంఘం సమావేశ మందిరంలో  రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  మంత్రి  మాట్లాడుతూ  ఎప్పటికప్పుడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాలను అప్రమత్తం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు,నష్టం జరగకుండా  ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు.అకాల వర్షాలు వలన ఏ రైతుకు నష్టం జరగాకుండా చూడాలని ముఖ్య మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.జిల్లాలో జయ బొండాలు 12 వేలు ఎకరాల వరకూ ఊడ్చారని అవి ఏలూరు బాయిల్డు రైస్ మిల్లుకు  తరలిస్తున్నామని రైతులు ఆందోళన చెందవద్దని అయన అన్నారు.నిన్నటి వరకూ 7.650 లక్షల మెట్రిక్ టన్నులు దాన్యం సేకరించామని, ఈ రోజు వాతావరణం బాగుంది 8 లక్షల మెట్రిక్ టన్నులు దాటిందని అయన అన్నారు.రైతులు ఇంబ్బందులు పడకూడదని ,పంట అంతా కోనుగోలు చెయ్యాలని , సకాలంలో డబ్బులు చెల్లించాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రులకు,జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారని అయన అన్నారు. ఆన్లైన్ గాని ఆప్ లైన్లో గాని ధాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయించి నష్టం జరిగి నప్పుడు వెనువెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుందని అయన అన్నారు.ప్రతి పక్ష నాయ కుడు అలోచన లేకుండా మాట్లాడు తున్నారని ఆయన పాలనలో రైతు లకు ఇన్పుట్ సబ్సిడీ  గాని మరేతర ప్రయోజనాలు కల్పించలేదన్నారు. ఈ రోజు ప్రతి పక్ష నాయకులు  ఉనికి కోసమే మాట్లాడుతున్నారని, అయన మాటలు ఎవ్వరూ నమ్మట లేదని ఆయన అన్నారు. రైతుకు పంట నష్టం జరిగిన ఆ నెల లోనే ఇన్సూరెన్స్ అందించి రైతులను ఆదుకుంటున్నామన్నారు.అనాడు ఉచిత కరెంటు ఇస్తామంటే తీగలు మీద బట్టలు అరబెట్టుకోవాలి అని  ప్రతిపక్షం నాయకుడు హేళన చేశారని ,రైతులకు  ఉచిత కరెంటు ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్న ఘనత స్వర్గీయ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి దక్కుతుందని అన్నారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయ నగరం,కృష్ణ జిల్లాలో  39 రైస్ మిల్లుల పై చర్యలు  తీసుకున్నామని అయన అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిన 33 మంది సంబంధిత అధికారులు , కస్టోడియన్, టెక్నికల్  సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మంత్రులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు రాత్రి అనక పగలు ఆనక  క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులతో మాట్లాడి వారి పండించిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేసి రైతులు సంతోషంగా ఉండేలా చేయుటయే మన ప్రభుత్వ  కర్తవ్యం అని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు.


ఈ సమావేశంలో  వివిధ శాఖలు అధికారులు, నాయకులు, తది తరులు పాల్గొన్నారు.




Comments