వీధి కుక్కలు దాడులు ,బెడద నుండి చిన్నారులను కాపాడాలి... ..... కేసలి అప్పారావు

 అమరావతి (ప్రజా అమరావతి);

                     

వీధి కుక్కలు దాడులు ,బెడద నుండి చిన్నారులను కాపాడాలి...

         ..... కేసలి అప్పారావు


               

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వీదికుక్కలు బెడద తీవ్రంగా ఉందని  స్వైర విహారం చేసి వీటి భారీన పడి చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం,గాయాలు పాలవడం జరుగుతుందని వీటిని  బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సంభందిత శాఖలు అనగా పురపాలక సంస్థ,పంచాయతీ రాజ్ శాఖ,ప్రజారోగ్య శాఖ మరియు పశు సంవర్ధన శాఖ వారు భాగస్వామ్య మై సమన్వయం చేసుకొని వీటిని  అత్యాధునిక సాంకేతిక నిపుణులు, పరిజ్ఞానంతో నివారించాలని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా ప్రస్తుతం అత్యధిక ఎండ తీవ్రతకు, మంచినీళ్ళు,ఆహారం కొరత వలన వీధి కుక్కలు ఆగ్రహానికి,అసహనానికి లోనై చర్మ వ్యాధులు తో బాధపడుతూ సమీపంలో ఉన్న చిన్నారులు, జన సంచారం మీద దాడులు చేసి,కరుస్తూ  భయభ్రాంతులకు గురిచేస్తున్నవి

బాలలు తెల్లవారు జామున యోగా , డాన్స్,సంగీతం మొదలగు తరగతులు కోసము వెళ్తున్న సందర్భాల లో ఇబ్బంది పడుతున్నారు. 

జంతు సంక్షేమ చట్టం నిబందనలకు లోబడి వీధి కుక్కలు కు కుటుంబ నియంత్రణ పద్ధతులు, పునరావాస కేంద్రాలు, వాక్సినేషన్,నిపుణులైన వైద్యుల, పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు.ముఖ్యంగా వీధి కుక్కలు బారిన పడకుండా ఉండాలంటే  ఫిర్యాదులు కొసం ఒక ప్రత్యేకమైన విభాగం ఫోన్ నంబర్  కేటాయించి  సీసీ కెమెరాలు ద్వారా తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు ను గుర్తించి నట్టు అయితే  కొంత పరిష్కారం అవుతుందనీ తెలిపారు.సంభందిత అధికారులు నిర్లక్షం చేస్తే బాలల హక్కుల కమిషన్ సుమోటో గా తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Comments