జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను, సెక్యూరిటీ ఏర్పాట్లును పరిశీలించారు.


నెల్లూరు (ప్రజా అమరావతి);



రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈ నెల 12 వ తేదీన కావలిలో పర్యటించనున్న  నేపథ్యంలో  బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, జిల్లా ఎస్పి శ్రీ తిరుమలేశ్వర రెడ్డి,  కావలి శాసన సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఇంటెలిజెన్స్ అధికారి శ్రీ గోపాలకృష్ణ లతో కలసి కావలి పట్టణంలోని   జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను, సెక్యూరిటీ  ఏర్పాట్లును పరిశీలించారు. 


అనంతరం   బహిరంగ సభ ప్రదేశాన్ని, పార్కింగ్ ప్రదేశాన్ని సందర్శించి సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.


జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్  కూర్మనాథ్, అడిషనల్ ఎస్పి  హిమవతి, నుడా వైస్ ఛైర్మన్  టి. బాపిరెడ్డి,  కావలి, ఆత్మకూరు ఆర్డీవో లు  శీనా నాయక్,  కరుణకుమారి,  ఆర్ అండ్ బి ఎస్. ఈ శ్రీ గంగాధర్, డిపిఓ  సుస్మిత, డిటిసి చందర్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య,  కావలి మునిసిపల్ కమీషనర్ శ్రీ శ్రీనివాస రావు, తహసీల్దార్ శ్రీ మాధవరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments