జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి పంచాయతీరాజ్ అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

 

నెల్లూరు.మే.2 (ప్రజా అమరావతి);

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి పంచాయతీరాజ్ అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల




ని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. కలెక్టరేట్లోని తిక్కన మీటింగ్ హాల్ లో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈవోపీఆర్డీలతో మంగళవారం  కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ,తాగునీటి సరఫరా, వీధి దీపాలు, గ్రామీణ రోడ్ల నిర్వహణ పై ఇఓపిఆర్డీలు, గ్రామ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాలలో వాటర్ ట్యాంకులు, OHSR , సంపులు, ప్రతి 15 రోజులకు ఒకసారి కచ్చితంగా పరిశుభ్రం చేయాలన్నారు , త్రాగునీటి వనరులు క్లీనింగ్ చేసినది రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అధికారులు సందర్శించినప్పుడు రిజిస్టర్లు తానికీ చేయాలన్నారు..త్రాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు కలుషితం అవడం వల్ల ఏవైనా అంటూ వ్యాధులు వస్తే గ్రామ కార్యదర్శులు, ఈవో పి ఆర్ డి లపై చర్యలు తీసుకుంటామన్నారు.  వీధి దీపాలపై ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలన్నారు. చెరువులు సైకిల్ స్టాండ్స్ లీజుకు తీసుకున్న వారి వద్ద నుండి ముందుగానే లీజు డబ్బు వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే చెల్లించవలసిన వారు ఉంటే తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు .గ్రామాలలో స్పందనలో వచ్చే సమస్యలను గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ,ఏ సమస్య రీఓపెన్  కాకూడదన్నారు. దోమలు ప్రబలకుండా మడుగులలో, కాలువలలో మురికి నీరు నిలువ లేకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయితీ అధికారి మరియు జడ్పీ సీఈవో శ్రీ చిరంజీవి సమీక్ష చేశారు.

Comments