ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం అయ్యేలా మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలి.



ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు

 వేగవంతం అయ్యేలా మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలి


*


*: ప్రతి అంగన్వాడి కేంద్రాన్ని సంబంధిత సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి*


*: జిల్లా ట్రెజరీ అధికారులు బాధ్యతగా పనిచేయాలి*


*: స్పందన గ్రీవెన్స్ లను గడువులోపు పరిష్కరించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*



పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా),  మే 22 (ప్రజా అమరావతి): 


ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం అయ్యేలా మండల స్పెషల్ ఆఫీసర్ లు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి .189. అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ ను ఎలాంటి ఉంచకుండా పరిష్కరించాలని, నాణ్యతగా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించాలని, రీఓపెన్ గ్రీవెన్స్ రాకుండా చూసుకోవాలన్నారు. గ్రీవెన్స్ పరిష్కారం పై ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు.


అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈనెల 19వ తేదీన జిల్లా అధికారులు  క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా అంగన్వాడి కేంద్రాల పనితీరు, నాడు - నేడు పనులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని తీరుపై సమస్యలను గుర్తించారని, గుర్తించిన సమస్యలను సకాలంలో వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ఆయా శాఖల  హెచ్ఓడిలపై ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో  చేపడుతున్న నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు, ప్రాధాన్యతా భవనాల నిర్మాణం, గ్రామ సచివాలయాల పని తీరు, నాడు - నేడు, గడప గడపకు మన ప్రభుత్వం తదితర పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యేలా మండల స్పెషల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వారానికి ఒకసారి మండలాలకు వెళ్లి ఎంపిడిఓ, సచివాలయ సిబ్బంది, హౌసింగ్,  పంచాయతీ రాజ్ ఇంజనీర్లు తదితర శాఖల మండల స్థాయి అధికారులతో సమావేశం అయి పనుల్లో పురోగతి చూపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భోజనం, బాలమృతం పంపిణీలో సక్రమంగా పని చేయని ఎన్పికుంట అంగన్వాడీ సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. కదిరి పూల బజార్ అంగన్వాడి కేంద్రం, ఓడిసి పరిధిలోని 5 అంగన్వాడి కేంద్రాలలో మూడు అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతులు సరిగా లేవని, లేపాక్షి, పరిగి, గోరంట్ల మండలాలలో మినీఅంగన్వాడి కేంద్రాల్లో పలు సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. వారం రోజులలో ఐసిడిఎస్ పిడి క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఐసిడిఎస్ పిడి అధ్యక్షతన ఆయా సిడిపిఓలు, సివిల్ సప్లై అధికారులు, ఏజెన్సీలు, అంగన్వాడి కేంద్రాల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని తెలిపారు. స్కూల్ తెరిచే నాటికి విద్యార్థులకు  జగనన్న విద్యా కానుక కిట్లను పూర్తి స్థాయిలో 100 శాతం పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో నాడు - నేడు పనులు వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగునీటి కల్పన, పాఠశాలలో విద్యుత్ సౌకర్యం, తదితర పనులను వేగంగా చేపట్టాలన్నారు. రోళ్ళ మండలానికి చెందిన కొట్టాల లావణ్యకు అమ్మ నాన్న చనిపోవడంతో వాత్సల్య పథకం కింద లబ్ధి చేకూర్చాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. జగనన్న తోడు పథకం కింద బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు కింద మంజూరు చేసిన పనులను వేగవంతంగా గ్రౌండింగ్ చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.*


1. చిలమత్తూరు మండల కేంద్రం నుంచి హనీఫ్ మాట్లాడుతూ చిలమత్తూరు గ్రామ ప్రజలకు మంజూరైన 168 ఇంటి స్థలాలను లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వలేదని, ఆ స్థలాలు కోర్టులో వివాదంలో ఉండడంతో లబ్ధిదారులకు ఇవ్వలేదని, వాటి స్థానంలో మరో చోట లేఔట్ వేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.


2. అనంతపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన సాకే లింగన్న మాట్లాడుతూ బత్తలపల్లి మండలంలోని గరిశనపల్లి గ్రామ పొలం సర్వేనెంబర్ 137/1 లో 2.60 ఎకరాల వ్యవసాయ భూమిని చెన్నప్ప నుంచి 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, అయితే సదరు భూమిలో సాకే లక్ష్మీదేవి, పోతులమ్మలు సాగులో ఉన్నారని, వెబ్ ల్యాండ్ లో వారి పేరు తొలగించి తమ పేరు మీద నమోదు చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిఈఓ మీనాక్షి, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ శివరంగ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments