తడిసిన ధాన్యాన్ని ,మొక్కజొన్న ని ప్రభుత్వం కొని రైతును ఆదుకోవాలి.

 *తడిసిన ధాన్యాన్ని ,మొక్కజొన్న ని ప్రభుత్వం కొని రైతును ఆదుకోవాలి.


*తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ*.                  గోపాలపురం (ప్రజా అమరావతి);

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చిట్యాలలో గోపాలపురం ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు  తలపెట్టిన రైతుగళం పాదయాత్ర లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు స్టీరింగ్ కమిటీ సభ్యులు అనంతరం  అకాల వర్షాలకు కల్లాల్లో తడిసిపోయిన మొక్కజొన్న రాశులను, మొక్క మొలిచిన ధాన్యాన్ని పరిశీలించారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ,రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు జవహర్ ,తెలుగు రైతు రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి ,రైతు నాయకులు,రతదితరులు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి తమకు శక్తికి మించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయి రంగు మారిపోతుంటే ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతును అన్యాయం చేస్తుందని ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం రైతు దగ్గర తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతును ఆదుకునీ రైతుకు నష్టపరిహారం కూడా ఇప్పించాలని రాష్ట్ర తెలుగు రైతు స్టీరింగ్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments