*వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా ప్రారంభం*
*: జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, మార్చి - 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 440 మంది లబ్ధిదారులకు రూ.3.12 కోట్ల లబ్ధి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 05 (ప్రజా అమరావతి):
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, మార్చి - 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మున్సిపల్ ఛైర్మన్ తుంగా ఓబులపతి, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఎస్సీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ మంజునాథ, ఏఎస్డబ్ల్యుఓ శ్రీరాములు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, మార్చి - 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 440 మంది లబ్ధిదారులకు రూ.3.12 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు.
జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా కింద జనవరి, మార్చి - 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 440 మంది లబ్ధిదారులకు రూ.3.12 కోట్ల లబ్ధి కలగడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు.
అందులో ఎస్సీ కేటగిరీ కింద 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున 76 లక్షల రూపాయలు, ఎస్సీ కేటగిరీ కింద ఇంటర్ క్యాస్ట్ వివాహం చేసుకున్న ఒక లబ్ధిదారులకి రు.1.20 లక్షల రూపాయలు లబ్ధి కలగడం జరిగిందన్నారు.
ఎస్టీ కేటగిరీ కింద 25 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున 25 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు.
బీసీ కేటగిరీ కింద 258 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు చొప్పున రూ.1.29 కోట్ల రూపాయలు, బీసీ కేటగిరీ కింద ఇంటర్ క్యాస్ట్ వివాహం చేసుకున్న 6 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 75 వేల రూపాయలు చొప్పున రూ.4.50 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు.
మైనారిటీ కేటగిరీ కింద 66 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున 66 లక్షల రూపాయలు లబ్ధి కలిగిందన్నారు.
వికలాంగుల కేటగిరీ కింద 7 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1 లక్ష 50 వేల రూపాయలు చొప్పున 10.50 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. బిసిఓడబ్ల్యూడబ్ల్యూబి కేటగిరీ కింద ఒక లబ్ధిదారులకు 40 వేల రూపాయలు లబ్ధి కలిగిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద, ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేయడం జరిగిందని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి ఖాతాలలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల ఖాతాలలో జగనన్న ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
addComments
Post a Comment