జేవీకే మండల స్టాకు పాయింట్లను తనిఖీ చేసిన పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ .

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*


గుంటూరు జిల్లాలో జేవీకే మండల స్టాకు పాయింట్లను తనిఖీ చేసిన పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ .



గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘జగనన్న విద్యాకానుక’ మండల స్టాకుపాయింటును పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు శుక్రవారం సాయంత్రం అకస్మిక తనిఖీ  చేశారు.  పాఠశాలకు చేరిన నోటు పుస్తకాలను, అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. సమగ్రంగా పాఠశాలలకు అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు చేరిన కిట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుని, సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.  పాఠశాల పున:ప్రారంభం నాటికి విద్యార్థులకు కిట్లు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం నారాకోడూరులోని చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని జాలాది రూపతిరుపతమ్మ ఇంటికి వెళ్లి పాఠశాలల్లో బోధన, ట్యాబ్ పనితీరు, వినియోగం  గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆ విద్యార్థినికి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ స్వయంగా వేయించి, రక్తహీనత, ఆరోగ్య భద్రత గురించి వివరించారు. సీఎస్ఈ వెబ్ సైట్ లో పొందుపరచిన పాఠ్య పుస్తకాలను చదివించారు.  సెలవుల్లో పుస్తకాలు చదివి విజ్నానం పెంచుకోవాలని సూచించారు. 

ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ తో పాటు గుంటూరు ఆర్జేడీ శ్రీ వి.ఎస్.సుబ్బారావు , గుంటూరు ఏపీసీ జి.విజయలక్ష్మి,  గుంటూరు సీఎంవో , గుంటూరు డిప్యూటీ ఈవో కె.సుధాకరరెడ్డి,  తెనాలి డిప్యూటీ ఈవో నిర్మలాదేవి,  సమగ్ర శిక్షా స్టేట్ సూపరిండెంటెంట్ ఎం.రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు. 


Comments