గ్రీవెన్స్ రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాం.

 *గ్రీవెన్స్ రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటాం*


*: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డికి వివరించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 25 (ప్రజా అమరావతి):


గ్రీవెన్స్ రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వివరించారు.


గురువారం అమరావతి నుండి.. జగనన్నకు చెబుదాం, హెల్త్ / ఐసిడిఎస్ పరిధిలో ప్రభుత్వ పథకాలు మరియు ఎస్డిజి ఇండికేటర్స్, స్కూల్ ఎడ్యుకేషన్, గ్రామ/వార్డు సచివాలయాలు, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.


పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, డిఆర్ఓ కొండయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా స్పందన గ్రీవెన్స్ ను నాణ్యతగా గడువులోపు పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. రీఓపెన్ గ్రీవెన్స్ ని ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నాణ్యతగా పరిష్కరించేలా చూస్తామన్నారు. పంచాయతీ రాజ్ పరిధిలోని సిసిరోడ్ల నిర్మాణం, ఎస్పీడీసీఎల్ పరిధి లోని విద్యుత్ పోల్స్ ఏర్పాటు, తదితర కొన్ని గ్రీవెన్స్ పరిష్కారం కోసం నిధులు అవసరమవుతాయని, నిధులను విడుదల చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని జిల్లా కలెక్టర్ కోరారు. హెల్త్ / ఐసిడిఎస్ పరిధిలో ప్రభుత్వ పథకాలు మరియు ఎస్డిజి ఇండికేటర్స్ లో పురోగతి చూపించేందుకు, గడప గడపకు మన ప్రభుత్వం, తదితర ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వివరించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు మధులత, భవాని శంకరి, డిఈఓ మీనాక్షి, ఐసిడిఎస్ పిడి కృష్ణ కుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, డిఆర్డీఏ పిడి నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments