గ్రామాల సమగ్ర అభివృద్ధి, కుటుంబాల సంపూర్ణ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నది.


నెల్లూరు మే 3 (ప్రజా అమరావతి);


గ్రామాల సమగ్ర అభివృద్ధి, కుటుంబాల సంపూర్ణ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.


బుధవారం సాయంత్రం పొదలకూరు మండలం కనుపర్తి పంచాయతీ లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి కాకాణి కి ప్రజలు జేజేలు పలికారు .


తోలుత గ్రామంలో  2 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాణి ప్రారంభించారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్న వైనం తెలుసుకునేందుకు, ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి ని అందించడానికి గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. అత్యంత పారదర్శకంగా ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమo అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం కలగలిపిన సుపరిపాలనను కొనసాగిస్తామన్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెంప పెట్టు లాంటి తీర్పు వచ్చిందని, గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీసే సమయం ఆసన్నమైందన్నారు.


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేణు గోపాల్ రెడ్డి , ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



Comments