ప్రమాదకర డెంగ్యూ వ్యాధి నివారణకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలి.మచిలీపట్నం మే 8 (ప్రజా అమరావతి);


ప్రమాదకర డెంగ్యూ వ్యాధి నివారణకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు  నిర్వహించి ప్రజలను చైతన్య పరచాల


ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఏర్పాట్లపై  అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా, మండల, గ్రామ సచివాలయాల స్థాయిల్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలన్నారు.


ఆరోజున డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల పై ర్యాలీలు, సమావేశాలు, అవగాహన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.

సామాజిక మాధ్యమాలు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా తమకు తాము రక్షించుకోవాలి అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.

ముఖ్యంగా గ్రామాల్లో మురికి కాలువల్లో పూడికలు తీసి నీరు పారేటట్లు చూడాలన్నారు.

అన్ని వీధుల్లో బ్లీచింగ్ చేయాలని,  దోమల మందు పొగ వదలాలని, దోమలు వృద్ధిచెందకుండా ఆయిల్ బాల్స్, దోమల మందు కాలువల్లో వేయాలని క్రమం తప్పకుండా పారిశుధ్యం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు.


తాగునీటి పైపులైన్లు లీకేజీ కాకుండా చూడాలని మంచినీటి కుళాయిలు వద్ద ఈడిస్ దోమ వృద్ధి చెందకుండా  ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

ప్రైవేట్ ప్రయోగశాలలు తప్పుడు వైద్య పరీక్షల నివేదికలు ఇవ్వకుండా చూడాలని ఎట్టి పరిస్థితులలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడరాదని ఎవరైనా తప్పుడు నివేదికలు ఇస్తే వారిపై అపరాధ రుసుములు వసూలు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అన్ని గ్రామాల్లో ప్రతి శుక్రవారం ఇంట్లో సామాగ్రి వంటపాత్రలు ఆరబెట్టుకునే విధంగా డ్రైడేను పాటించాలని సూచించారు.


కీటకాల ద్వారా మంచినీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ప్రతి పాఠశాలలో కొంతసేపు విద్యార్థులకు అవగాహన కలిగించానన్నారు.


డెంగ్యూ వ్యాధి సోకిన  వారికి చికిత్స అందించేందుకు అన్ని వైద్యశాలలు ఏర్పాటు చేయాలన్నారు

వారానికి రెండు గ్రామాల చొప్పున లార్వల్ సర్వే నిర్వహించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు

లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు.

హైరిస్కు ఉన్న ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించి డెంగ్యూ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కీటక జనిత వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివిధ రకాల కరపత్రాలు హోల్డర్లు స్టిక్కర్లు గోడపత్రాలను జిల్లా కలెక్టర్  ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు,        కే ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి, ఆర్డీవో ఐ కిషోర్, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి  పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Comments