ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు సక్రమంగా అందించాలి.

 *ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు సక్రమంగా అందించాలి**: ప్రసవాలు మరిన్ని జరిగేలా చూడాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*: గాండ్లపెంట పిహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*


గాండ్లపెంట (శ్రీ సత్యసాయి జిల్లా), మే 26 (ప్రజా అమరావతి):


ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు సక్రమంగా అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఓపి సేవలు ఎంతమందికి అందించారు, ఇక్కడ ఎన్ని ప్రసవాలు జరిగాయి, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన సేవలు బాగా అందించాలన్నారు. ఈరోజు ఓపికి 80 మంది వచ్చారని తెలుపగా, ఓపి సేవలు మరింత మందికి అందించేలా చూడాలన్నారు. ఏప్రిల్ నుంచి ఇక్కడ రెండు ప్రసవాలు జరగగా, మరింత మందికి ప్రసవాలు జరపాలని, ఈ విషయమై మరింత పురోగతి సాధించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించి మంచిపేరు తెచ్చుకునేలా పనిచేయాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నుంచి అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డా. కృష్ణారెడ్డి, మెడికల్ అధికారి డా.బాబా ఫక్రుద్దీన్, పిహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Comments