స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలి.

 స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 15 (ప్రజా అమరావతి):


*స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ 171 అర్జీలను  స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి  . అర్జీలను స్వీకరించడం జరిగింది.


మరింత బాధ్యతగా ప్రజా సమస్యలు పరిష్కరించండి  కలెక్టర్


కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందన, జగనన్న కు చెబుదాం కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో నమోదయ్యే సమస్యలను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమం ను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి పేరు ను చేర్చడం వల్ల జిల్లా యంత్రాంగం పై మరింత బాధ్యత ఏర్పడిందన్నారు. ప్రజలు సమస్యలను, సూచనలను 1902 నెంబర్‌ కు కాల్‌ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. రీ ఓపెన్ పిటిషన్ లు 51ఉన్నాయని, రీ ఓపెన్ పిటిషన్లు రాకుండా నాణ్యతగా పిటిషన్లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్ లను సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ పిటిషన్లను జిల్లా అధికారులు నిత్యం ఓపెన్ చేసి చూసుకోవాలని, అర్జీదారుడితో మాట్లాడాలని, అర్థమయ్యేలా అతనికి వివరించాలని, సమాచారం తెలియజేయాలని, సంతృప్తి కలిగేలా పరిష్కారం చూపించి ఎప్పటికప్పుడు పిటిషన్లను క్లోజ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్, ఆర్డీఓలు పిటిషన్ లకు పరిష్కారం నాణ్యతగా అందించాలన్నారు. మాటలు కాదు చేతల్లో పని చూపించాలని, ప్రాపర్ గా స్పందన పిటిషన్ లను పరిష్కరించాలని ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్లలో రెవిన్యూకి సంబంధించి ఎక్కువ పిటిషన్ లు ఉంటున్నాయని, ఏ విధమైన ఎండార్స్మెంట్ ఇచ్చారు అనేది పరిశీలించి అర్జీదారుడితో వ్యక్తిగతంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపించి రీఓపెన్ కాకుండా సమస్యను పరిష్కరించాలని తెలిపారు

ప్రతిరోజు ఎంపీడీవోలు, తహసిల్దార్లు, జిల్లా అధికారులు కార్యాలయానికి రాగానే రీఓపెన్ కేసులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుని పరిష్కరించాలని, అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎన్ని పిటిషన్లు వచ్చాయి అనేది చూసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేగవంతంగా పిటిషన్ల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏరోజు కా రోజు పిటిషన్ల పరిష్కారం చేయకపోతే పెండింగ్ పిటిషన్ల సంఖ్య పెరుగుతుందని, హడావిడిగా కాకుండా జాగ్రత్తగా పిటిషన్లకు పరిష్కారం చూపించాలన్నారు. అర్జీదారుడుతో మాట్లాడి, ఉన్న పరిస్థితిని వివరించి, సంతృప్తి కలిగేలా పరిష్కరించి నిబంధనలు పాటించి పిటిషన్ను క్లోజ్ చేయాలన్నారు. అత్యంత శ్రద్ధ పెట్టి గ్రీవెన్స్ పరిష్కరించాలని, గడువులోపు పరిష్కరించడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.*


1. ముదిగుబ్బ మండలం కొండగట్టు పల్లి గ్రామానికి చెందిన మంగేనాయక్ మాట్లాడుతూ కొండగట్టు గ్రామ పొలం నందు సర్వేనెంబర్ 405 లో 1.15 సెంట్ల భూమి ఉండగా, తిరుపాల్ నాయక్ అనే వ్యక్తి మా భూమి పై పట్టాదారు పాస్ పుస్తకం చేసుకున్నారని, అతని పేరుపై ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేయాలని విన్నవించుకున్నారు.


2. హిందూపురం మండలంలోని కొటిపి గ్రామానికి చెందిన రామన్న మాట్లాడుతూ మా తల్లి సాకమ్మ పేరుమీద 1990వ సంవత్సరంలో ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేశారని, పట్టా కనిపించడం లేదని, మాకు ఇచ్చిన స్థలానికి అనుభవ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు.


*ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిఈఓ మీనాక్షి, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డిఎస్ఓ వంశీకృష్ణ, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*



Comments