రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాజీపడకుండా మొక్కజొన్న కొనుగోలు

 *"అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష"*


అమరావతి (ప్రజా అమరావతి):

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి .


సమీక్షకు హాజరైన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , సహకార మరియు మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి , వ్యవసాయ శాఖ కమీషనర్ హరికిరణ్ , ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీధర్ , మార్కెటింగ్ శాఖ కమీషనర్ రాహుల్ పాండే , ఏపీ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు , ఏపీ ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇతర సీనియర్ అధికారులు.


 అకాల వర్షాలకు జరిగిన పంటల నష్టాల అంచన, నష్టపరిహారం అందించేందుకు చర్యలు, రైతులు పండించిన మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బికేల ద్వారా అందించడం, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కాకాణి.*


అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగం పట్ల అంచనాలు తయారు చేయడంలో గానీ, నష్టపరిహారం అందించడంలో గానీ, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి  ఆదేశాలనుసారం ఉదారంగా వ్యవహరించేందుకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ అధికారులను కోరిన మంత్రి.


 రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాజీపడకుండా మొక్కజొన్న కొనుగోలు


చేయడంతో పాటు, గిట్టుబాటు ధర లభించని ఇతర పంటలను గుర్తించి, కొనుగోళ్లు చేపట్టవలసిందిగా సూచించిన మంత్రి కాకాణి.


 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి, సబ్సిడీ విత్తనాలు అందించేందుకు ఖరారు చేసిన యాక్షన్ ప్లాన్ ను పరిశీలించిన మంత్రి కాకాణి.


ఖరీఫ్ సీజన్ కు సంబంధించి, అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఆర్బికేలలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి కాకాణి.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆదేశాలనుసారం రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్న మంత్రి కాకాణి.

Comments