రేపే డోన్ లో 'కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్' ప్రారంభం : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*రేపే డోన్ లో 'కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్' ప్రారంభం : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*ఐటీఐ కళాశాల కొత్త భవనంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి బుగ్గన*


డోన్,మే,28 (ప్రజా అమరావతి); నంద్యాల జిల్లా డోన్ లో 'కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్' ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం డోన్ లోని ఐటీఐ కళాశాల కొత్త భవనంలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 10 కోర్సులలో వందలాది మంది యువతకు శిక్షణనందించే వీలుగా ఏర్పాటు చేయనున్న ఎక్స్ లెన్స్ సెంటర్ కు సుమారు రూ.2 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. ఐటీఐలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పలు యంత్రాలపై నిష్ణాతులైన శిక్షకులతో నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. యంత్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కియా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఐటీఐలో శిక్షణ అనంతరం ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం పొంది అక్కడ నైపుణ్యం పొంది అక్కడ నైపుణ్యం పెంపొందించే కన్నా..ఐటీఐలోనే పలు ట్రేడ్ ల విద్యార్థులు కియా వారు ఏర్పాటు చేసే యంత్రాలపై ప్రత్యేక శిక్షణతో ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దేందుకు కసరత్తు పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్యాప్ సీఈవో ఎంకేవీ శ్రీనివాసులు, కియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


Comments