*చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలి
*
పార్వతీపురం, మే 20 (ప్రజా అమరావతి): ప్రాథమిక విద్య బలోపేతం చేసి చిన్నారుల బంగారు భవితకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం బలిజిపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. బలిజిపేటలోని గృహ నిర్మాణల లే అవుట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు క్రింద చేపడుతున్న భవనాల ఆధునీకరణ పనులను, నారాయణ పురం మండల పాఠశాలలోని అంగాన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని, బర్లి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నాడు నేడు రెండో దశ పనులలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం భవాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక దశలో చిన్నారులకు చక్కని విద్యతోపాటు పౌష్ఠికాహారం సక్రమంగా అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. బర్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గర్భిణీలకు అందిస్తున్న పాలు వివరాలను స్టాక్ రూంలో రికార్డులను పరిశీలించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్స్, అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న లబ్ధిదారుల వివరాల నమోదును సరిచూసారు. సమన్వయ లోపం లేకుండ పౌష్ఠికాహారం అమలు రికార్డులను ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని బరువు తక్కువ ఉన్న చిన్నారులు, రక్త హీనత కలిగిన గర్భిణీలు, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని అందుతున్న సేవలను, చిన్నారుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. మడక వేదాన్సి, పలిశెట్టి గీతోన్మయి అనే చిన్నారులు అడిగిన ప్రశ్నలకు చక్కగా జవాబులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులను అభినందించారు. చిన్నారుల బంగారు భవిష్యత్ చక్కగా తీర్చదిద్దడంలో అంగన్వాడి కార్యకర్తలు భాద్యతగా వ్యవహరించాలని అన్నారు. కేంద్రానికి కరెంట్ లేకపోవడాన్ని గమనించి కలెక్టర్ ప్రశ్నించగా విద్యుత్ మీటర్ లేదని సి డి పి ఓ తెలపగా వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల విద్యా శాఖ అధికారికి ఆదేశించారు. సమీపంలోనే నాడు నేడు రెండో దశ పనులు క్రింద చేపడున్న నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం గదుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.
*గృహ నిర్మాణ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్*
బలిజిపేటలోని గృహ నిర్మాణాల లేఔట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ దశలోని నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. పునాది దశలో 26 ఇల్లు నిర్మాణంలో ఉండగా, పై కప్పు స్థాయికి ఐదు, గృహ నిర్మాణాలు పూర్తి అయినవి 4 ఉన్నాయని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయి కిరణ్ వివరించారు. అక్కడే ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణం ఆలస్యం గల కారణాలను అడిగితెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘం గ్రూప్ ద్వారా రుణం మంజూరైనందున వెంటనే నిర్మాణ పనులు చేపడతామని తెలపగా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షిస్తున్నందున వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న అదనపు తరగతుల భవన ఆధునీకరణ పనులు, ఫ్లోరింగ్ పనులు నిశితంగా పరిశీలించారు. స్కూల్ లు ప్రారంభం నాటికి పనులు పెండింగ్ ఉండకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె.రత్న కుమారి, ఎమ్.పి.డి. ఓ ఏ.భాను మూర్తి, గృహనిర్మాణ శాఖ డి ఈ అర్. ఐ.వి.ప్రసాద్, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ అధికారి కేతిరెడ్డి విజయ గౌరీ, మండల విద్యా శాఖ అధికారి శ్రీనివాస్, సి డి పి ఓ సి హెచ్. సుగుణ, ప్రధాన ఉపాధ్యాయులు సుధా దేవి, గ్రామ సచివాలయం సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment