లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న "నారా లోకేష్ యువగళం.

 *- లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న "నారా లోకేష్ యువగళం


"* 

 *- దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేస్తున్న పాదయాత్ర* 

 *- హలో లోకేష్ కార్యక్రమాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన*

 *- ఇప్పటి వరకు 1.40లక్షల మందితో సెల్ఫీ విత్ లోకేష్* 

 *- నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన వెనిగండ్ల రాము* 



గుడివాడ, మే 14 (ప్రజా అమరావతి): అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలు, అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యం దిశగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోందని టీడీపీ నేత వెనిగండ్ల రాము చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నిర్వహిస్తున్న యువగళానికి ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. జనగళమే యువగళమై సాగుతున్న ఈ పాదయాత్ర దిగ్విజయంగా 100రోజులు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రంలోని 34 నియోజకవర్గాల్లో 1, 268 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిందన్నారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను నారా లోకేష్ ఎండగడుతూ వస్తున్నారన్నారు. మరోవైపు ప్రజలను చైతన్యవంతం చేస్తూ వారితో మమేకమవుతున్నారన్నారు. ప్రభుత్వ కవ్వింపు చర్యలు, పోలీసుల ఆంక్షలను కూడా అధిగమిస్తూ నారా లోకేష్ ముందుకు కదులుతున్నారన్నారు. 100 రోజుల పాదయాత్రలో 32 ప్రాంతాల్లో బహిరంగ సభలను నిర్వహించడం జరిగిందన్నారు. వివిధ వర్గాలతో దాదాపు 87 ముఖాముఖి సమావేశాలు జరిగాయన్నారు. హలో లోకేష్ పేరిట నాలుగు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45రోజులు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 32రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగిందన్నారు. ప్రజల నుండి దాదాపు 1900 వినతిపత్రాలు రాతపూర్వకంగా అందాయన్నారు. పాదయాత్రలో వేల మంది ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులతో సమావేశాలను నిర్వహిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కార మార్గాలను నారా లోకేష్ సూచిస్తూ వస్తున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక పోవడం వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా సర్టిఫికెట్ లను అందజేస్తామని నారా లోకేష్ హామీ ఇస్తున్నారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసానిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటి స్థితి, గతులను ఎత్తిచూపుతూ నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ లను విసురుతున్నారన్నారు. ప్రతి జిల్లాలోనూ హలో లోకేష్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమానికి కూడా మంచి ఆదరణ వస్తోందన్నారు. ఇప్పటి వరకు 1.40లక్షల మందితో లోకేష్ ఫొటోలు దిగారన్నారు. ప్రతి 100కిలోమీటర్లకు నారా లోకేష్ ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ఆయా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీ ఇస్తున్నారని చెప్పారు. అకుంఠిత దీక్షతో యువగళం పాదయాత్రను 100 రోజులు పూర్తిచేసిన నారా లోకేష్ కు వెనిగండ్ల శుభాకాంక్షలు తెలిపారు.

Comments