వెంటనే పరిష్కారమైన స్పందన అర్జీ .

 వెంటనే పరిష్కారమైన స్పందన అర్జీ 

మచిలీపట్నం మే 29 (ప్రజా అమరావతి);


మచిలీపట్నం కార్పొరేషన్ చిలకలపూడికి చెందిన వంకా  జోగారావు తనకు 77 సంవత్సరాల వయస్సని, సరిగా వినపడక చాలా ఇబ్బందులు పడుతున్నానని,  ఇతరుల సహాయంతో నడుస్తున్నానని తనకు వినికిడి యంత్రం, చక్రాల కుర్చీ కావాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబుకు  సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు.  జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఎంతో ఔదార్యంతో అతనికి వినికిడి యంత్రాన్ని తెప్పించి అందజేశారు. చక్రాల కుర్చీని విజయవాడ నుండి తెప్పించి మరో మూడు రోజుల్లో అందజేస్తామని కలెక్టర్ అర్జీదారునికి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తనకు వినికిడి యంత్రాన్ని అందజేసినందుకు జోగారావు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్  డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, దివ్యాంగుల శాఖ ఏడి రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments