డోన్ లో కొత్త ఎంపీపీ భవన నిర్మాణానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ.*డోన్ లో కొత్త ఎంపీపీ భవన నిర్మాణానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ


*


*రూ.1.50 కోట్లతో నిర్మించనున్న  భవన నిర్మాణ పనులకు శ్రీకారం*


*డోన్ లో నేషనల్ హైవే నిర్మాణ పనులకు భూమిపూజ*


డోన్, మే, 26 (ప్రజా అమరావతి); డోన్ మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎంపీపీ కార్యాలయం ఆవరణలో రూ.1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.గతంలో 1975లో నిర్మించిన  సమితి భవనాలలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ పాత భవనం శిథిలావస్థకు చేరడంతో మంత్రి బుగ్గన చొరవ తీసుకుని  నూతన భవన నిర్మాణానికి నిధులు సమకూర్చి శుక్రవారం ఆ పనులకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు రూ.630 కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారి-340బి పనులకు సంబంధించి డోన్ పట్టణంలో భూమి పూజ నిర్వహించారు. ఓర్వకల్ మండలం సోమయాజులపల్లె నుంచి బేతంచెర్ల మీదుగా డోన్ వరకూ నేషనల్ హైవే అందుబాటులోకి తెచ్చే పనులకు మంత్రి బుగ్గన సమక్షంలో మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేశ్ శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేశ్, జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మునిజీర్ జిలానీ సమూన్, ఆర్డీవో వెంకటరెడ్డి,జెడ్పీటీసీ సభ్యులు రాజ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.Comments