నాడు- నేడు పనుల్లో పురోగతి చూపించాలి.

 *నాడు- నేడు పనుల్లో పురోగతి చూపించాలి


*


*: వారంరోజుల్లో పురోగతి చూపించకపోతే చర్యలు తీసుకుంటాం*


*: జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 11 (ప్రజా అమరావతి):


నాడు- నేడు పనుల్లో పురోగతి చూపించాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మనబడి నాడు- నేడు పనులపై జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మనబడి నాడు- నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వారంరోజుల్లోపు పురోగతి చూపించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. వెనుకబడిన 10 మండలాల్లో పనులు వేగంగా జరగాలన్నారు. జిల్లాలోని గుడిబండ, ముదిగుబ్బ, బత్తలపల్లి, రామగిరి, అగళి, గోరంట్ల, రొళ్ల, ఎన్పికుంటా, నల్లమడ, గాండ్లపెంట, తదితర మండలాల్లో నాడు- నేడు పనుల్లో పురోగతి తక్కువగా ఉందని, వెంటనే వేగంగా పనులు చేపట్టి పనులను పురోగతిలోకి తీసుకురావలన్నారు. సిమెంట్ వచ్చినా పనులు జరగడం లేదని, వెంటనే అలసత్వం లేకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. పనుల్లో తక్కువ ఎక్స్పెండిచర్ నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలన్నారు. పనులు పురోగతిలోకి రాలేదని ఇరిగేషన్ అధికారులకు, గుడిబండ ఇరిగేషన్ ఏఈకి షోకాజ్ నోటీస్ లు ఇవ్వాలన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు రాకపోతే, పనుల్లో పురోగతి లేకపోతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నాడు- నేడు పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరితగతిన చేపట్టేలా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈఓ మీనాక్షి, ప్లానింగ్ ఆఫీసర్ మదన్, ఆయా మండలాల ఎంఈఓలు గోపాల్, శ్రీధర్, సుధాకర్ నాయుడు, వేమనారాయణ, గోపాల్ నాయక్, చాముండేశ్వరి, కృష్ణానాయక్, గోపి, ఏపిఎంలు, ఫీల్డ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.


Comments