నెల్లూరు మే 1 (ప్రజా అమరావతి);
ఏ ఇంటి గడప తొక్కినా ఏ ఒక్క పధకం అందలేదనే మాటరాని సంపూర్ణ సంతృప్త స్థాయిలో పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం పొదలకూరు మండలం మొగళ్లూరు గ్రామంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి కాకాణి కి ఎస్ సి కాలనీ ప్రజలు హారతులతో స్వాగతం పలికి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
అనంతరం మొగళ్ళురు గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలను అభిమాన జన సందోహం మధ్య, చిరు జల్లుల ఆహ్లాధకర వాతావరణంలో ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్, పొదలకూరు సమితి మాజీ అధ్యక్షులు కాకాణి రమణా రెడ్డి ల విగ్రహాలను మంత్రి కాకాణి ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్దే లక్ష్యం గా పనిచేస్తున్నామ
ని, కేవలం మొగళ్లూరు గ్రామ పరిధిలోనే ఈ మూడేళ్లలో 4 కోట్ల 40 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసామన్నారు. ప్రజలు కోరుకుంటున్న సంక్షేమం అందుతున్నది లేనిది తెలుసుకుంటూ, గ్రామాలకు సంబంధించి ప్రజల అభీష్టాలకనుగుణంగా అభివృద్ధి చేసేందుకు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏ ఇంటి గడప తొక్కినా ఏ ఒక్క పధకం అందలేదనే మాటరాని సంపూర్ణ సంతృప్త స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేద్దామనే ధ్యాస లేని ప్రతిపక్షం అధికారం కోసం అర్రులు చాస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల లక్ష్మీ , జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment