నారా లోకేష్ స్ఫూర్తితో యువతలో భరోసా నింపుతున్న వెనిగండ్ల.

 *- నారా లోకేష్ స్ఫూర్తితో యువతలో భరోసా నింపుతున్న వెనిగండ్ల* 


*- ఇప్పటికే 1500 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన*

*- గుడివాడ చరిత్రను తిరగరాసిన టిడిపి నేత వెనిగండ్ల*

*- నియోజకవర్గం నుండి 100 మంది కార్యకర్తలతో "యువగళానికి"*

*- చంద్రబాబు గెలిస్తేనే భవిష్యత్తు ఉంటుందని భావిస్తోన్న యువత* 

*- యువత భాగస్వామ్యంతో విజయవంతంగా సాగుతోన్న పాదయాత్ర*

*- 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం* 

*- ఉద్యోగాల కల్పనపై పూర్తిస్థాయిలో చంద్రబాబు దృష్టి పెడతారన్న వెనిగండ్ల*గుడివాడ, మే 10 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ఫూర్తితో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో టిడిపి నేత వెనిగండ్ల రాము యువతలో భరోసాను నింపుతున్నారు. గుడివాడలో ప్రప్రథమంగా అతిపెద్ద మెగా జాబ్ మేళా నిర్వహించి చంద్రబాబు హయాంలో ఉన్న  ప్రముఖ కంపెనీలను ఆహ్వానించారు. దాదాపు 1500 మందికి పైగా నిరుద్యోగులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలను కల్పించిన వెనిగండ్ల గుడివాడ చరిత్రను తిరగ రాశారు. ఈ స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తున్న వెనిగండ్ల యువతను పెద్దఎత్తున ఆకర్షించడం ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రబాబు గుడివాడ పర్యటన తర్వాత వెనిగండ్ల తనదైన శైలిలో దూకుడును పెంచుతూ పోతున్నారు. దీనిలో భాగంగానే నారా లోకేష్ విజయవంతంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలను వెనిగండ్ల తీసుకువెళ్లారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులోని గాజులదిన్నెలో గుడివాడ టిడిపి శ్రేణులను నారా లోకేష్ తో కలిపి వెనిగండ్ల నడిపించారు. ఇదిలా ఉండగా బుధవారం వెనిగండ్ల ఒక ప్రకటన విడుదల చేస్తూ, నందికొట్కూరు నియోజకవర్గంలో 95 వ రోజు యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకే నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ పాదయాత్రకు లక్షలాదిగా తరలి రావడాన్ని బట్టి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉందని స్పష్టమవుతుందన్నారు. యువత కూడా పెద్దఎత్తున భాగస్వాములవుతున్నారని తెలిపారు. పాదయాత్ర చేస్తూనే యువతతో నారా లోకేష్ ముఖాముఖి సమావేశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, మెగా డీఎస్సీ, గ్రూప్ -2 నోటిఫికేషన్, విద్యార్థులకు ఉన్నత విద్య, హాస్టల్ వసతి కల్పించడం, మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరుతున్నట్టు చెప్పారు. గత ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు నారా లోకేష్ ఒక హామీని ఇస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిస్థాయిలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడతారని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుండి దాదాపు 100కు పైగా పరిశ్రమలు తరలిపోయాయన్నారు. టిడిపి పాలనలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని యువత భావిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని, గ్రూప్ పరీక్షల నిర్వహణతో పాటు ఖాళీల భర్తీ వంటివి జరుగుతాయన్నారు. ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టిడిపి హయాంలో అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు. యువగళం పాదయాత్రపై గుడివాడ నియోజకవర్గంలోని యువతను చైతన్యవంతం చేస్తున్నట్టు వెనిగండ్ల వివరించారు.

Comments