ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధంముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం.


- చారిత్రాత్మక ఘట్టానికి కావలి వేదిక కావడం మన అదృష్టం

- రాష్ట్ర రైతాంగానికి నేడు పండుగ రోజు

- దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యకు నేటితో విముక్తి

- అసాధారణ నిర్ణయం తీసుకున్న సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు కావలి పట్టణం ముస్తాబు

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు, మే 11 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, హెలిపాడ్, బహిరంగ సభ వేదిక వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి వెల్లడించారు. గురువారం సాయంత్రం కావలిలో సీఎం పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ తలసీల రఘురాంతో కలిసి  ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు రైతులందరూ ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర రైతాంగానికి నేడు పండుగ రోజు అని, నేటి నుంచి చుక్కల భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం కానందున్నారు. జిల్లాలో సుమారు 23 వేల మంది రైతులకు సంబంధించి సుమారు 43270 ఎకరాల భూములను 22ఎ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి స్వహస్తాలతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసే చారిత్రాత్మక ఘట్టానికి కావలి పట్టణం వేదిక కావడం మన అదృష్టంగా మంత్రి పేర్కొన్నారు. అసాధారణ నిర్ణయంతో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించి, రైతుల పక్షపాతిగా కావలి పట్టణానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కావలి పట్టణం ముస్తాబైందని, రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి రైతులందరూ తమ ఆశీస్సులు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పంట నష్టపోయిన రైతులకు బీమా, ఇన్పుట్ సబ్సిడీ త్వరలోనే అందిస్తామని, ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 


Comments