భూములను త్వరగా గుర్తించాలి.

 *భూములను త్వరగా గుర్తించాలి**: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి  (శ్రీ సత్యసాయి జిల్లా), మే 26 (ప్రజా అమరావతి):


జిల్లాలో వివిధ జాతీయ రహదారులు, రైల్వే, ఇతర ప్రాజెక్టుల కోసం అటవీ భూములు తీసుకుంటున్న నేపథ్యంలో ఫారెస్ట్ కంపన్శాటరి అపార్స్టేషన్ (compensatory afforestation) కోసం భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఫారెస్ట్ సీఎ (compensatory afforestation) ల్యాండ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టులు, విద్యుత్ లైన్ ల కోసం అటవీ భూమిని సేకరించాల్సి వస్తోందని, అటవి భూమిని తీసుకుంటున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా భూములను అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయమై జిల్లాలో భూములను గుర్తించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కోసం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అనంతరం జెన్కో కు సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించాలని, తర్వాత ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యత పరంగా భూమిని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం గుర్తించిన అటవీ భూములకు తగ్గట్టుగా భూములను ఇవ్వాల్సి ఉంటుందని, త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ రవీంద్రారెడ్డి, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పేనాయక్, ఎన్ హెచ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.Comments