*ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి*
*: ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించడం చేపట్టాలి*
*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 03 (ప్రజా అమరావతి):
హౌసింగ్ కి సంబంధించి ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై జిల్లా, మండల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హౌసింగ్, స్పందన, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ ఆఫీసర్ శివారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లో ఇళ్ల నిర్మాణంలో పురోగతి కోసం జిల్లాలోని 32 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలని జెసికి సూచించారు. ఇందుకోసం డిఆర్ఓతో మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ ల నియామకం చేపట్టేలా చూడాలన్నారు. మండలాన్ని మూడు జోన్లుగా విభజించి తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈలకు లేఔట్లు, లబ్ధిదారుల వారిగా కొంత చొప్పున కేటాయించడం జరిగిందని, వీటిపై పర్యవేక్షణ చేయడం కోసం మండల స్పెషల్ ఆఫీసర్ ని నియమించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఏమి బాగాలేదని, దీనిపై హౌసింగ్ పిడి మరింత దృష్టి సారించాలన్నారు. వచ్చే ఒకటి, రెండు నెలల్లోపు ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలన్నారు. వచ్చే శుక్ర, శనివారంలో జిల్లాలో ఒక డివిజన్ కు సంబంధించి హౌసింగ్ పై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఆయా శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొనాలని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలన్నారు.
స్పందనకు సంబంధించి రీ ఓపెన్ కేసులు 11 పెండింగ్ ఉన్నాయని, అందులో 4 రెవెన్యూ, సర్వే, 3 హౌసింగ్, ఎస్పీడీసీఎల్ కు సంబంధించి కేసులు ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ కి సంబంధించి పెండింగ్ ఉన్న అర్జీలను గడువులోగా పరిష్కరించేలా చూడాలన్నారు. రీ సర్వే కి సంబంధించి ఎంపిక చేసిన గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 0-5 ఏళ్ల చిన్నారుల ఆధార్ డేటా అప్డేట్ విషయంలో 61 శాతం పూర్తి చేయడం జరిగిందని, 6-19 ఏళ్ల మధ్య ఉన్న వారికి 71 శాతం అప్డేట్ చేయడం జరిగిందని, జిల్లాలో వెనుకబడిన మండలాల్లో వెంటనే పురోగతి చూపించి అప్డేట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిగా చేపట్టాలన్నారు. ఈ విషయమై ఎంపీడీవోలు శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మంజులైన పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తిస్థాయిలో చేయాలని, మొదలుపెట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు.
addComments
Post a Comment